'డాన్' డెన్‌లో కృతి ఎంట్రీ ఎప్పుడంటే..!
బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులకు డాన్ సినిమా చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 16 May 2025 4:00 PM ISTబాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులకు డాన్ సినిమా చాలా స్పెషల్ అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు వచ్చిన డాన్ ప్రాంచైజీ సినిమాల్లో షారుఖ్ ఖాన్ నటించాడు. డాన్ ప్రాంచైజీ సినిమాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో డాన్ 3 కోసం హిందీ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డాన్ 2 వచ్చిన దాదాపు 15 ఏళ్ల తర్వాత డాన్ 3 సినిమా రాబోతుంది. డాన్ 3 సినిమాలో షారుఖ్ ఖాన్ కాకుండా బాలీవుడ్ మరో క్రేజీ హీరో రణ్వీర్ సింగ్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాను పట్టాలెక్కించారనే వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అధికారికంగా ప్రకటన కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో రూపొందుతున్న డాన్ 3 సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్, టెస్ట్ షూట్, ప్రీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ నడుస్తున్నట్లు ఆ మధ్య చిత్ర యూనిట్ సభ్యుల్లో ఒకరు చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్‌కు జోడీగా ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ నటించబోతుంది. బాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తున్న కృతి సనన్ డాన్ 3 సినిమాలో ఎంట్రీ ఇవ్వడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
ధనుష్ హీరోగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తేరి ఇష్క్ మైన్' సినిమాలోనూ కృతి సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. త్వరలోనే ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ సినిమా పూర్తి కానుంది. కృతి సనన్ ప్రస్తుతం ధనుష్ సినిమాపైనే దృష్టి పెట్టిందని, ఆ సినిమా పూర్తి అయిన తర్వాత డాన్ 3 సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. డాన్ 3 సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే సమయంకు తేరి ఇష్క్ మైన్ సినిమా షూటింగ్ పూర్తి కావాలని కృతి సనన్ ఇప్పటికే నిర్మాతలతో చెప్పిందని సమాచారం అందుతోంది. ధనుష్ సినిమాలో కృతి సనన్ పాత్ర ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కృతి సనన్ గత ఏడాదిలో తేరీ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా, క్రూ, దో పట్టి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలతో బాలీవుడ్‌లో మరింత బిజీ అయింది. అయితే డాన్ 3 సినిమాకు ఉన్న ప్రాముఖ్యత నేపథ్యంలో వచ్చిన కొన్ని ఆఫర్లను కృతి సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది. డాన్ 3 సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వస్తే, ఆ తర్వాత మరిన్ని సినిమాల్లో కృతి సనన్ నటించే అవకాశాలు ఉన్నాయి. నార్త్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ వరుస సినిమాలు చేస్తూ, అక్కడ ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుని దూసుకు పోతున్న కృతి సనన్ మళ్లీ తెలుగులో ఎప్పుడు కొత్త సినిమాకు కమిట్ అవుతుందో చూడాలి.