Begin typing your search above and press return to search.

కృతి స‌నోన్ ఫ్లాట్ అద్దె ఎంతో తెలిస్తే షాకింగే

మ‌రోవైపు కృతి స‌నోన్ త‌దుప‌రి ర‌ణ్ వీర్ స‌ర‌స‌న డాన్ 3లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   7 July 2025 10:00 PM IST
కృతి స‌నోన్ ఫ్లాట్ అద్దె ఎంతో తెలిస్తే షాకింగే
X

కృతి సనన్ టాలీవుడ్, బాలీవుడ్ లో పాపుల‌ర్ న‌టి. కెరీర్ ఆరంభ‌మే ఈ బ్యూటీ మ‌హేష్ లాంటి అగ్ర క‌థానాయ‌కుడి స‌ర‌స‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత నాగ‌చైత‌న్య స‌ర‌స‌నా ఓ చిత్రంలో న‌టించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో అగ్రశ్రేణి తారలలో ఒకరిగా ప్ర‌యాణం సాగిస్తోంది. ఇక `మిమి`లో న‌ట‌న‌కు గాను కృతి స‌నోన్ జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డును సైతం కొల్ల‌గొట్టింది. 2014లో టైగర్ ష్రాఫ్‌తో కలిసి హీరోపంథి చిత్రంతో బాలీవుడ్ ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ భామ‌ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.

హిందీ ప‌రిశ్ర‌మ‌లో దిల్‌వాలే, హౌస్‌ఫుల్ 4, భేదియా, క్కూ స‌హా మరెన్నో క్రేజీ చిత్రాల్లో న‌టించింది. అదే స‌మ‌యంలో ప్ర‌భాస్ ఆదిపురుష్ చిత్రంతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇక నిర్మాత‌గా మారి రూపొందించిన తొలి చిత్రం `దో పట్టి` గ్రాండ్ స‌క్సెసైంది. ఈ చిత్రం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.

మ‌రోవైపు కృతి స‌నోన్ త‌దుప‌రి ర‌ణ్ వీర్ స‌ర‌స‌న డాన్ 3లో న‌టించే అవ‌కాశం ఉంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ స‌మ‌యంలో కృతి విలాసాల ఇంటి గురించి ఆన్ లైన్ లో చాలా చ‌ర్చ సాగుతోంది. ఆకాశ హార్మ్యాన్ని త‌ల‌పిస్తున్న ఓ భారీ భ‌వంతిలో డూప్లెక్స్ లో నివ‌శిస్తోంది కృతి.

కృతి సనన్ గ‌తంలో అమితాబ్ బచ్చన్ నుండి అద్దెకు తీసుకున్న విలాసవంతమైన డ్యూప్లెక్స్ లో అద్దెకు ఉండేది. అప్ప‌ట్లోనే నెలకు రూ. 10 లక్షల అద్దె చెల్లించేద‌ని సమాచారం. ఈ భ‌వంతి పేరు అట్లాంటిస్. ఇందులో 27వ , 28వ అంతస్తులో కృతి, ఆమె ఫ్యామిలీ నివసించేది. కానీ ఇప్పుడు సడెన్ గా ఇల్లు మారింద‌ని తెలిసింది. ఇప్పుడు కొత్త ఇంటి కోసం 11ల‌క్ష‌లు అద్దె చెల్లిస్తోంద‌ని స‌మాచారం. ఇక ఇందులో ఫ్లాట్ ని సొంతం చేసుకోవాలంటే కోట్ల‌లో పెట్టుబ‌డి పెట్టాల్సి ఉంటుంది.