కిష్కింధపురి గ్లింప్స్... శ్రీనివాస్ ఇంప్రెస్సివ్ హార్రర్ ప్రయోగం
రీసెంట్ గా మేకర్స్ ఈ సినిమాకు టైటిల్ ను రివీల్ చేయగా ఇప్పుడు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
By: Tupaki Desk | 29 April 2025 7:55 PM ISTటాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు హైంధవం, టైసన్ నాయుడు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న శ్రీనివాస్, ఈ రెండింటితో పాటూ ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు. అదే బీఎస్ఎస్11. శ్రీనివాస్ కెరీర్లో 11వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుంది.
రీసెంట్ గా మేకర్స్ ఈ సినిమాకు టైటిల్ ను రివీల్ చేయగా ఇప్పుడు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. కౌశిక్ పెగిళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన కిష్కింధకాండలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మేకర్స్ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తి నెలకొల్పుతూ ఉత్కంఠ రేపేలా ఉంది. హార్రర్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కుతున్న గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది.
ఎప్పుడైనా సరే హార్రర్ కు సరైన సస్పెన్స్ యాడ్ అయితే అది సూపర్ హిట్ కాంబినేషన్ గా నిలవడం ఖాయం. ఇప్పుడు కిష్కింధపురిలో కూడా కౌశిక అలాంటి ప్రయోగమే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓ పాడు బడిన ఇంట్లో ఎంతో కాలంగా మూసేసి ఉన్న రూమ్ ను తెరవడం వల్ల జరిగే అనర్థాలు ఎలా ఉంటాయనే దాని ఆధారంగా సినిమా ఉండనున్నట్టు గ్లింప్స్ లో చూపించారు.
కొన్ని తలుపులు ఎప్పటికీ ఓపెన్ చేయకూడదు, కొన్ని గొంతులు ఎప్పటికీ వినకూడదంటూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ గ్లింప్స్ లో సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలవగా, సామ్ సి.ఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. అప్పట్లో శ్రీనివాస్, అనుపమ కలిసి రాక్షసుడు అనే క్రైమ్ థ్రిల్లర్ చేసి హిట్ అందుకోగా, ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి హార్రర్ థ్రిల్లర్ చేస్తున్నారు. మరి కిష్కింధకాండ ఈ జంటకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. గ్లింప్స్ చూస్తుంటే ఈసారి బెల్లంకొండ శ్రీనివాస్ ఏదో గట్టిగానే ట్రై చేసినట్టు అనిపిస్తుంది.