వీడియో : చీర కట్టులో కేతిక రొమాంటిక్..!
సినిమాల్లో అందంగా కనిపించడంతో పాటు, నటనతో మెప్పించే కేతిక శర్మ సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో అందాల ఆరబోతతో ఆకట్టుకుంటూ ఉంది.
By: Tupaki Desk | 27 April 2025 11:00 PM ISTనితిన్ హీరోగా నటించిన 'రాబిన్‌హుడ్' సినిమాలో అదిదా సర్‌ప్రైజ్ అంటూ ఐటెం సాంగ్ చేసి అందరినీ నిజంగానే సర్‌ప్రైజ్ చేసిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. ఆమె కాస్ట్యూమ్స్, మేకోవర్, డాన్స్ స్టెప్పులు ఇలా ప్రతి ఒక్కటీ మాస్ ఆడియన్స్‌కి నచ్చాయి. కేతిక శర్మ హీరోయిన్‌గా కెరీర్ ఆరంభంలో మంచి సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ లక్ కలిసి రాకపోవడంతో తక్కువ సమయంకే హీరోయిన్‌గా ఆఫర్లు లేకుండా పోయాయి. హీరోయిన్‌గా ప్రస్తుతం ఈమె చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేదు. అయినా కూడా ఈమెకు సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు దక్కింది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 3.5 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్న విషయం తెల్సిందే.
సినిమాల్లో అందంగా కనిపించడంతో పాటు, నటనతో మెప్పించే కేతిక శర్మ సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో అందాల ఆరబోతతో ఆకట్టుకుంటూ ఉంది. అందంగా ఉండే కేతిక శర్మ సింపుల్ ఔట్ ఫిట్ నుంచి స్కిన్ షో చేసే ఔట్ ఫిట్ వరకు ఏ డ్రెస్‌లో కనిపించినా కూడా చూపు తిప్పుకోనివ్వని అందం ఈమెది అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌గా ఈమెకు మంచి ఎంట్రీ దక్కడానికి కారణం ఈమె అందం అనడంలో సందేహం లేదు. ముందు ముందు ఈమె మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోవచ్చు. తాజాగా ఈమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగానే హీరోయిన్స్ చీర కట్టు ఫోటోలను షేర్ చేస్తూ చూపు తిప్పుకోలేము. అలాంటిది కేతిక శర్మ వంటి అందగత్తే చీర కట్టుకుని, అందంగా కెమెరాకు ఫోజ్ ఇస్తున్న వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సాధారణంగా ఫోటో స్టిల్స్ ను షేర్ చేస్తారు. కానీ ఈ అమ్మడు ఫోటో షూట్‌కి సంబంధించిన వీడియోను షేర్ చేయడం ద్వారా వైరల్ అవుతోంది. కేతిక శర్మ అందం గురించి గతంలో ఎన్నో సార్లు మాట్లాడుకునే ఉంటాం. అయినా కూడా ఈమె ఇలాంటి వీడియోలను, ఫోటోలను షేర్ చేసిన సమయంలో మరోసారి ఈమె అందం గురించి మాట్లాడుకోవాల్సిందే అనిపిస్తూ ఉంటుంది. నడుము అందం చూపిస్తూ కేతిక హొయలు పోతూ షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటూ ఉంది.
చీర కట్టులో కేతిక శర్మ ఫోటోలు చాలా సార్లు షేర్ చేసింది. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా ఆకట్టుకుంటుంది. అందమైన ఫోటోలు, వీడియోలతో ఎప్పుడూ కేతిక శర్మ వార్తల్లో నిలుస్తున్న కారణంగా కచ్చితంగా ఈమెకు మరిన్ని ఆఫర్లు దక్కవచ్చు. ప్రస్తుతం రెండు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే ఆ సినిమాలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి అయ్యే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్‌గా ఈమె చివరిగా రంగ రంగ వైభవంగా సినిమాలో వైష్ణవ్ తేజ్‌కు జోడీగా నటించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ఆ సినిమా తర్వాత ఒక హిందీ సినిమాను కూడా ఈమె చేసింది.