Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్ కోసం వాళ్ల ఎదురుచూపులు..!

ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో ఎల్లమ్మ సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. ఈ సినిమాకు ఆమె బ్లక్ డేట్స్ కావాలని అడిగారట.

By:  Tupaki Desk   |   16 May 2025 9:14 PM IST
కీర్తి సురేష్ కోసం వాళ్ల ఎదురుచూపులు..!
X

మహానటి కీర్తి సురేష్ మొన్నటిదాకా సౌత్ లోనే సినిమాలు చేయగా జస్ట్ పెళ్లికి ముందే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ బేబీ జాన్ అనే సినిమాతో అమ్మడు చేసిన ప్రయత్నం తెలిసిందే. అదేంటో తెలుగు, తమిళ్ లో పదుల సంఖ్యలో సినిమాలు చేసిన కీర్తి సురేష్ తనలోని హా**ట్ యాంగిల్ ని చూపించింది లేదు. కానీ అమ్మడు మాత్రం హిందీలో చేసిన తొలి సినిమాకే ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. దీనికి ప్రత్యేకంగా కారణం అంటూ ఏది లేదు. సౌత్ భాలౌ ఎవరైనా బాలీవుడ్ వెళ్లగానే ముందు గ్లామర్ తోనే అక్కడ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తారు.

కీర్తి సురేష్ కూడా అదే దారిలో వెళ్లాలని చూస్తుంది. బేబీ జాన్ రిజల్ట్ ఆమెను సాటిస్ఫై చేయలేదు. ఐతే కీర్తి సురేష్ సౌత్ ఫ్యాన్స్ మాత్రం అమ్మడిలోని ఈ డిఫరెంట్ యాంగిల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో కీర్తి సురేష్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోనిని పెళ్లాడింది. 15 ఏళ్లుగా సీక్రెట్ లవ్ స్టోరీని నడిపించిన కీర్తి సురేష్ ఫైనల్ గా పెళ్లితోనే తన సోల్ మేట్ ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.

పెళ్లి కాగానే బేబీ జాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న అమ్మడు ఆ తర్వాత ఇక హాలీడేస్ తీసుకుంది. భర్తతో ఎంచక్కా ప్రపంచ యాత్రలో ఉన్న కీర్తి సురేష్ నెక్స్ట్ కమిట్ మెంట్స్ ఉన్నా కూడా తీరిక చేసుకునే టైం కనిపించట్లేదు. పెళ్లైన ఏ హీరోయిన్ అయినా కూడా ఏడాది పాటు అలా విహరిస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. కీర్తి కూడా ప్రస్తుతం అలాంటి మూడ్ లోనే ఉంది. ఐతే ఆమె కమిటైన సినిమా మేకర్స్ ఆమె ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో ఎల్లమ్మ సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. ఈ సినిమాకు ఆమె బ్లక్ డేట్స్ కావాలని అడిగారట. ఐతే కీర్తి మాత్రం ఎప్పుడు షూటింగ్ కి వస్తానన్నది క్లారిటీ ఇవ్వట్లేదట. ఆమె కోసం చిత్ర యూనిట్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారని తెలుస్తుంది. ఐతే కీర్తి కూడా హాలీడేస్ టైం లో సినిమాల గురించి ఆలోచన వదిలేసి భర్తతో ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తుంది. అందుకే విహార యాత్రలు ముగించుకుని వచ్చిన తర్వాతే సినిమ యూనిట్ తో టచ్ లో ఉండాలని అనుకుందట. ఐతే త్వరలోనే ఎల్లమ్మ ఫస్ట్ షెడ్యూల్ మొదలు పెడుతున్నారని తెలుస్తుంది. నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బలగం వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది.