కరీనా చెప్పుల అసలు మ్యాటర్ ఇది..!
కరీనా కపూర్ కాళ్లకు కొల్హాపురి సాంప్రదాయ చెప్పులు ధరించింది. ఆ ఫోటోకు కరీనా కపూర్ కామెంట్‌గా.. సారీ ఇవి ప్రాడా కాదు, నా ఓజీ కొల్హాపురి సాంప్రదాయ చెప్పులు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
By: Tupaki Desk | 8 July 2025 1:00 PM ISTబాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి చెందిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. సెలబ్రిటీలు రెగ్యులర్‌గా హాలీడే ట్రిప్స్‌కి వెళ్తూ ఉంటారు. కరీనా కపూర్ సైతం ఫ్యామిలీతో రెగ్యులర్‌గా ట్రిప్‌లకి వెళ్తూనే ఉంటుంది. తాజాగా కరీనా కపూర్ ఖాన్ ఒక హాలీడే ట్రిప్‌కు వెళ్లిన సమయంలో అక్కడ తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. అదే సమయంలో సన్ బాత్ చేస్తున్న ఒక ఫోటోను సైతం ఆమె షేర్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆమె వేసుకున్న చెప్పులు, ఆ చెప్పుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
కరీనా కపూర్ కాళ్లకు కొల్హాపురి సాంప్రదాయ చెప్పులు ధరించింది. ఆ ఫోటోకు కరీనా కపూర్ కామెంట్‌గా.. సారీ ఇవి ప్రాడా కాదు, నా ఓజీ కొల్హాపురి సాంప్రదాయ చెప్పులు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక్కడ ప్రాడా ఎందుకు వచ్చింది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే రూ.1000 నుంచి రూ.1500 లకు లభించే కొల్హాపురం చెప్పులను అదే తరహా డిజైన్ కాపీ చేసి ప్రాడా అనే అంతర్జాతీయ కంపెనీ చెప్పులు తయారు చేసి ఏకంగా రూ.1.2 లక్షలకు అమ్ముతుంది. అదే మెటీరియల్, అదే డిజైన్, అదే ఫ్యాషన్ అయినప్పటికీ అంతర్జాతీయ స్థాయి కంపెనీ తయారు చేయడంతో లక్షకు పైగా రేటు పెట్టడం జరిగింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రాడా తయారు చేస్తున్న కొల్హాపురి మోడల్ చెప్పులకు మంచి డిమాండ్ ఉంది. ఇండియాలో పెద్దగా ఆ చెప్పులను కొనుగోలు చేయకున్నా ఇతర దేశాల్లో కొనుగోలు చేసే వారు చాలా మంది ఉన్నారు. కొల్హాపురి మోడల్ చెప్పులను కాపీ కొట్టిన ప్రాడా కంపెనీ చెప్పులను ఇండియాలో సైతం కొందరు లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేసి కొనుగోలు చేయడం మనం చూస్తూ ఉంటాం. వారందరికీ చెంప పెట్టు అన్నట్లుగా కరీనా కపూర్ ఖాన్ కొల్హాపురి చెప్పులను ధరించడం ద్వారా ఇండియన్ బ్రాండ్ గౌరవం పెరిగేలా చేసింది. కోట్లాది మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న కరీనా కపూర్ ఆ చెప్పులను ధరించడంతో ఒక్కసారిగా కొల్హాపురి చెప్పుల గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 14 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న కరీనా కపూర్ ఖాన్ ఏ చిన్న బ్రాండ్‌ను ప్రమోట్ చేయాలన్నా లక్షల పారితోషికం అందుకుంటూ ఉంటుంది. అలాంటి కరీనా కపూర్ ఖాన్ పారితోషికం తీసుకోకుండానే కొల్హాపురి మోడల్ చెప్పుల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అంతా కూడా ఆ చెప్పుల కోసం వెతుకులాట మొదలు పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్‌లో టాప్ బ్రాండ్ అయిన ప్రాడా కంపెనీ వారు కాపీ కొట్టిన ఆ కొల్హాపురి చెప్పులు మాకు కావాలి అంటూ ఆన్ లైన్ ద్వారా చాలా మంది ఆర్డర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియన్ వస్తువులు కొనుగోలు చేసే విధంగా కరీనా ఈ ప్రాడెక్ట్ గురించి స్పందించడం నిజంగా అభినందనీయం అంటూ సోషల్ మీడియాలో ఆమెకు ప్రశంసలు దక్కుతున్నాయి.