ఏడాదికి రూ.200 కోట్లు.. బాబోయ్ ఏంటి ఈ పారితోషికం!
కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బుల్లి తెరపై, ఓటీటీ రంగంలో కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యే వారు చాలా మంది ఉన్నారు. బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చుకుని, కామెడీ షో లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు కపిల్ శర్మ.
By: Tupaki Desk | 24 Jun 2025 2:00 PM ISTదీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత సినిమా ఇండస్ట్రీకి చక్కగా సరి పోతుంది. ఆ సామెత పాటించకుండా ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం అనేది అసాధ్యం. అందుకే ప్రతి ఒక్కరూ కెరీర్ జోరు మీద ఉన్నప్పుడు మాత్రమే పారితోషికం పెంచుతారు, అందుకు తగ్గట్లుగా నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. హీరోలు, హీరోయిన్‌లు మాత్రమే కాకుండా ఇండస్ట్రీకి చెందిన అన్ని వర్గాల వారు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఉంటారు. కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బుల్లి తెరపై, ఓటీటీ రంగంలో కూడా ఇదే పద్దతిని ఫాలో అయ్యే వారు చాలా మంది ఉన్నారు. బుల్లి తెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను తెచ్చుకుని, కామెడీ షో లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు కపిల్ శర్మ.
ఈయన సుదీర్ఘ కాలంగా కామెడీ షో లు చేస్తూ వస్తున్నాడు. మొదట్లో టీవీ ఛానల్స్‌లో ఈయన షో లు వచ్చేవి. ఇప్పుడు ఓటీటీలో ఈయన కామెడీ షో లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. గత ఏడాది నుంచి ఈయన ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో ను రన్ చేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి కామెడీ షో లు ఏడాదికి ఒక సీజన్ చొప్పున వస్తూ ఉంటాయి. కానీ షో కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండానే ఏడాది గ్యాప్‌లోనే రెండు సీజన్‌లను తీసుకు వచ్చారు, మూడో సీజన్ షూటింగ్ సైతం పూర్తి చేసి స్ట్రీమింగ్‌కు రెడీ చేశారు. మూడో సీజన్‌కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో కోసం హోస్ట్‌గా కపిల్ శర్మ తీసుకునే పారితోషికం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ షో ఒక్కో ఎపిసోడ్ కోసం కపిల్ శర్మ ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. మొదటి సీజన్‌ను గత ఏడాది జూన్‌లో స్ట్రీమింగ్ చేశారు. మొదటి సీజన్‌లో మొత్తంగా 13 ఎపిసోడ్స్‌ను స్ట్రీమింగ్ చేయడం జరిగింది. అన్ని ఎపిసోడ్స్‌కి మంచి స్పందన వచ్చింది. ఇక రెండో సీజన్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో స్ట్రీమింగ్ చేశారు. ఇక సీజన్ 3 ను సైతం ఇప్పటికే మొదలు పెట్టారు. సీజన్ 3 మొదటి ఎపిసోడ్‌లో సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా రావడంతో మంచి స్పందన దక్కింది. ఈ నేపథ్యంలో మూడో సీజన్‌కి కపిల్ శర్మ ఎంత పారితోషికం అందుకుంటున్నాడు అనే చర్చ మొదలైంది.
మొదటి సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచి కపిల్ శర్మ ప్రతి ఎపిసోడ్‌కి రూ.5 కోట్ల పారితోషికంను అందుకుంటున్నాడు. మొదటి సీజన్ లో 13 ఎపిసోడ్స్‌కు గాను రూ.65 కోట్లు, రెండో సీజన్ 13 ఎపిసోడ్స్‌కు గాను రూ.65 కోట్ల పారితోషికంను ఇప్పటికే అందుకున్నాడు. మొదటి రెండు సీజన్‌లకు ఏకంగా రూ.130 కోట్ల పారితోషికంను అందుకున్నాడు. ఇక తాజా సీజన్‌కు గాను ఆయన 13 ఎపిసోడ్స్‌కి ఏకంగా రూ.65 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడు. దాంతో ఏడాదిలోనే కపిల్ శర్మ ఈ కామెడీ షో తో దాదాపు రూ.200 కోట్ల పారితోషికం ను అందుకుంటున్నాడు.
స్టార్ హీరోలు వంద కోట్ల పారితోషికం తీసుకుని రెండు మూడు ఏళ్లు కష్టపడుతున్నారు. అలాంటిది ఈ కపిల్ ఏడాదిలో మూడు సీజన్‌లు అది కూడా నవ్వుతూ, నవ్విస్తూ హాయిగా హోస్టింగ్ చేయడం ద్వారా రూ.200 కోట్ల పారితోషికం ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.