Begin typing your search above and press return to search.

కన్నప్ప‌: ఫైనల్ కట్ రెడీ.. 3 గంటల పైనే రన్‌టైమ్

ఈ సినిమా ఫైనల్ రన్‌టైం 3 గంటల 2 నిమిషాలు 51 సెకన్లు గా లాక్ అయిందట. అంటే సుమారు 182 నిమిషాల పాటు ఈ చిత్రం థియేటర్‌లో నడవనుంది.

By:  Tupaki Desk   |   24 Jun 2025 5:00 PM IST
కన్నప్ప‌: ఫైనల్ కట్ రెడీ.. 3 గంటల పైనే రన్‌టైమ్
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న సినిమా కన్నప్ప. ఇది కేవలం మరో పాన్ ఇండియా చిత్రం మాత్రమే కాకుండా, తెలుగు సినిమాకు ఓ ప్రెస్టిజియస్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ కావడం గమనార్హం. ప్రాచీన భారతీయ ఇతిహాసాల నుంచి ప్రేరణ పొందిన ఈ సినిమా శ్రీకాళహస్తి శైవ భక్తుడైన కన్నప్ప జీవితాధారంగా రూపొందుతోంది. మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు రేపుతోంది.

ఇక తాజా సమాచారం ప్రకారం కన్నప్ప మూవీ ఫైనల్ కట్ పూర్తయ్యింది. ఈ సినిమా ఫైనల్ రన్‌టైం 3 గంటల 2 నిమిషాలు 51 సెకన్లు గా లాక్ అయిందట. అంటే సుమారు 182 నిమిషాల పాటు ఈ చిత్రం థియేటర్‌లో నడవనుంది. మామూలు కమర్షియల్ సినిమాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ రన్‌టైమ్. అయితే దర్శకులు, రచయితలు కథ నిడివిని కట్ చేయకుండా, భావోద్వేగాలకు పర్ఫెక్ట్ గా చోటివ్వడానికే ఈలా డిసైడ్ చేసినట్టు సమాచారం.

ఇక ఈ చిత్రంలో ప్రభాస్ కీలక పాత్రలో రుద్రుడిగా కనిపించనున్నారు. ఈ పాత్రకు సంబంధించిన సీన్స్ రెండో భాగంలో వస్తాయని, ఆయన స్క్రీన్ టైమ్ సుమారు 20 నిమిషాలు ఉంటుందని ఇప్పటికే విష్ణు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇంటర్వెల్ తర్వాత 15 నిమిషాలకే ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది అని తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో రన్‌టైమ్ ఎక్కువగా ఉన్నా, ప్రేక్షకులకు ఎక్కడా బోర్ అనిపించకుండా కథ నడుస్తుందన్న కాన్ఫిడెన్స్ టీమ్‌కు ఉంది.

సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్‌లు ఇప్పటికే బాగా హైప్ క్రియేట్ చేయగా, ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది. విష్ణు చేసిన ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ చిత్రానికి స్టీఫెన్ సంగీతం అందించగా, విజువల్ ప్రెజెంటేషన్ లో హాలీవుడ్ స్టాండర్డ్స్‌ను ఫాలో అవుతున్నట్టు టాక్. మొత్తం మీద సినిమా ఎంత నిడివితో ఉన్నా, ఎమోషన్, విజువల్స్, డ్రామా కలిపి దాన్ని గ్రిప్‌ఫుల్‌గా మార్చడానికి దర్శకుడు ఎంతో కష్టపడ్డారని విష్ణు తెలిపారు.

ఇక మోహన్ బాబు ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించనున్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు ఏవిఎ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా.. మన చారిత్రక భక్తిని నలుదిశలకి చాటే విధంగా ఉంటుందన్న నమ్మకం కనిపిస్తోందని మోహన్ బాబు తెలియజేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.