Begin typing your search above and press return to search.

‘కన్నప్ప’ యానిమేటెడ్ కామిక్ బుక్: ఇది ఫైనల్ ఎపిసోడ్!

‘కన్నప్ప’ సినిమాలో విష్ణు మంచుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శరత్ కుమార్, ముఖేష్ రుషి, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 May 2025 1:37 PM IST
‘కన్నప్ప’ యానిమేటెడ్ కామిక్ బుక్: ఇది ఫైనల్ ఎపిసోడ్!
X

మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా టాలీవుడ్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం, శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరపైకి రానుంది. ఈ సినిమా కోసం ఓ వర్గం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా జూన్ 27 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘కన్నప్ప’ యానిమేటెడ్ కామిక్ బుక్ సిరీస్‌లో చివరి భాగం బుక్-3 విడుదలై, సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.


‘కన్నప్ప’ సినిమాలో విష్ణు మంచుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శరత్ కుమార్, ముఖేష్ రుషి, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు. ఈ సినిమా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, AVA ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నిర్మితమవుతుంది. ఇక ప్రభుదేవా కొరియోగ్రఫీ సినిమాకు మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఈ స్టార్ కాస్ట్, భారీ నిర్మాణ విలువలతో ‘కన్నప్ప’ సినిమా గురించి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

‘కన్నప్ప’ యానిమేటెడ్ కామిక్ బుక్ సిరీస్‌లో చివరి భాగం బుక్-3 విడుదలై, అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ లో భక్తి, ప్రేమ, త్యాగం, విధి అనే అంశాలను అద్భుతమైన యానిమేషన్‌తో తెరపైకి తీసుకొచ్చింది. ఈ ఫైనల్ ఎపిసోడ్ మే 16 యూట్యూబ్‌లో విడుదలైంది, ఇది తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. “హర హర మహదేవ్” అనే నినాదంతో ఈ సిరీస్ భక్తి రసాన్ని మరింత ఉధృతం చేసింది.

ఈ యానిమేటెడ్ సిరీస్‌లో కన్నప్ప కథను అద్భుతమైన విజువల్స్‌తో చూపించారు. శివ భక్తుడైన కన్నప్ప తన నిజమైన భక్తిని, తన కన్ను అర్పించి శివుడిని సంతృప్తి పరిచే ఘట్టం ఈ సిరీస్‌లో హైలైట్‌గా నిలిచింది. అలాగే శివపార్వతుల దర్శనం మరొక హైలెట్. ఈ యానిమేషన్ సిరీస్ కన్నప్ప కథను కొత్త తరం ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. ఈ ఎపిసోడ్స్ ద్వారా సినిమా చూసే ముందు ఒక అవగాహన కల్పిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ‘కన్నప్ప’ యానిమేటెడ్ కామిక్ బుక్ సిరీస్ గురించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సిరీస్ కన్నప్ప భక్తి రసాన్ని అద్భుతంగా చూపించింది, సినిమా కోసం ఎదురుచూస్తున్నాం అంటూ అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఈ సిరీస్ సినిమాకు ముందు హైప్‌ను మరింత పెంచింది. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.