Begin typing your search above and press return to search.

కాజ‌ల్ కెరీర్ కూడా అంతే గ్రాండ్ గా ముగిస్తుందా?

రావ‌ణాసురుడి పాత్ర‌లో పాన్ ఇండియా సంచ‌ల‌నం య‌శ్ న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌ధాన పాత్ర ధారులంతా షూటింగ్ లో భాగ‌మ‌య్యారు.

By:  Tupaki Desk   |   16 May 2025 8:00 PM IST
కాజ‌ల్ కెరీర్ కూడా అంతే గ్రాండ్ గా ముగిస్తుందా?
X

బాలీవుడ్ లో ` రామాయ‌ణం` ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. నితీష్ తివారీ ద‌ర్శ‌క త్వంలో రూపొందుతున్న చిత్రంలో రాముడి పాత్ర‌లో ర‌ణ‌బీర్ క‌పూర్...సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి న‌టి స్తున్నారు. రావ‌ణాసురుడి పాత్ర‌లో పాన్ ఇండియా సంచ‌ల‌నం య‌శ్ న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌ధాన పాత్ర ధారులంతా షూటింగ్ లో భాగ‌మ‌య్యారు. తాజాగా ఈప్రాజెక్ట్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఎంట‌ర్ అయింది.

కాజ‌ల్ సినిమాలో రావ‌ణుడి స‌తీమ‌ణి మండోద‌రి పాత్రకు ఎంపికైంది. టీమ్ ఇప్ప‌టికే కాజ‌ల్ తో సంప్ర దింపులు జ‌రిపి ఒప్పించిన‌ట్లు స‌మాచారం. గ‌త వార‌మే కాజల్ పై లుక్ టెస్ట్ కూడా నిర్వ‌హించారుట‌. మండోదరి పాత్ర‌కు అమ్మ‌డు ప‌ర్పెక్ట్ గా సూట‌వ్వ‌డంతో ఎంపిక ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాజ‌ల్ సెకెండ్ ఇన్నింగ్స్ ఎంతో గొప్ప‌గా ముందుకెళ్తుంది. వివాహ‌మైన త‌ర్వాత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాలే చేస్తోంది.

లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తో పాటు శ‌క్తివంత‌మైన పాత్ర‌లు కాజ‌ల్ ని వెతుక్కుంటూ మ‌రీ వె ళ్తున్నాయి. విష్ణు హీరోగా న‌టిస్తోన్న `క‌న్న‌ప్ప‌`లో కాజ‌ల్ పార్వ‌తిదేవి పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆ ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. వాటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పార్వ‌తిదేవికి నుదిటిన బొట్టు పెట్ట‌ని స్టిల్ పై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మైనా త‌ర్వాత వాటిని స‌రిచేసుకున్నారు.

ఈ సినిమాల‌న్నింటికంటే ముందే కెరీర్ ఆరంభంలో మ‌గ‌ధీర‌లు యువ‌రాణి పాత్ర‌తో ఎంతో మందికి క‌ల‌క‌ల హీరోయిన్ గానూ మారింది. అప్ప‌టి నుంచి ఇండ‌స్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వ‌చ్చారు. కానీ ఎవ‌రికీ ప్రిన్సెస్ పాత్ర పోషించే అవ‌కాశం రాలేదు. కాజ‌ల్ పోషించిన పాత్ర టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే నిలి చిపోయింది. ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన ప్రతీ హీరోయిన్ కు కాజ‌ల్ లాంటి పాత్ర పోషించాల‌ని కోరుకున్న వారే.

అలా కెరీర్ ఆరంభంలోనే ట్రెండ్ సెట్ట‌ర్ భామ‌గా నిలిచింది. సెకెండ్ ఇన్నింగ్స్ కూడా అంతే అద్భుతంగా కొన‌సాగిస్తుంది. చూస్తుంటే కాజ‌ల్ కెరీర్ కూడా అంతే గ్రాండ్ గాముగించే లా ఉంది. గొప్ప పాత్ర‌ల‌న్ని కాజ‌ల్ ని మాత్ర‌మే వెత‌క్కుంటూ రావ‌డం అన్న‌ది ఆమెకే చెల్లింది.