Begin typing your search above and press return to search.

ట్రైలర్‌ రిలీజ్‌.. కొడుక్కి మెగాస్టార్‌ ఆశీస్సులు

ఆయన మాత్రం అరుదుగా తన ఎక్స్‌ ద్వారా సినిమాల టీజర్‌లు, ట్రైలర్‌లను తీసుకు వస్తాడు. తాజాగా ఆయన తీసుకు వచ్చిన కాళీధర్‌ లాపాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్‌ మూవీగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   23 Jun 2025 1:00 PM IST
ట్రైలర్‌ రిలీజ్‌.. కొడుక్కి మెగాస్టార్‌ ఆశీస్సులు
X

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఎక్స్‌ ద్వారా ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటారు. తన బ్లాగ్‌ ద్వారా అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటూ ఉంటారు. తాజాగా అమితాబచ్చన్‌ 'కాళీధర్‌ లాపాట' అనే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇండస్ట్రీలో పెద్ద కావడంతో తమ సినిమాల యొక్క ట్రైలర్‌లను, టీజర్‌లను అమితాబ్‌ చేతుల మీదుగా విడుదల చేయించాలని అంతా కోరుకుంటారు. ఆయన మాత్రం అరుదుగా తన ఎక్స్‌ ద్వారా సినిమాల టీజర్‌లు, ట్రైలర్‌లను తీసుకు వస్తాడు. తాజాగా ఆయన తీసుకు వచ్చిన కాళీధర్‌ లాపాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్‌ మూవీగా తెలుస్తోంది.

కాళీధర్‌ లాపాట సినిమా మధుమిత దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాలో జూనియర్‌ బచ్చన్‌ అభిషేక్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటించడం జరిగింది. అమితాబ్ బచ్చన్‌ స్థాయి స్టార్‌డంను దక్కించుకోవడంలో అభిషేక్ బచ్చన్‌ విఫలం అయ్యాడు. అయితే తనకు ఉన్న ఇమేజ్‌తో హీరోగానే కాకుండా నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు, అన్ని రకాల పాత్రలను చేయడం ద్వారా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కించుకోవడంలో సఫలం అయ్యారు. తాజాగా ఈయన కాళీధర్‌ లాపాట సినిమాలో నటించడం ద్వారా నటుడిగా మరో మూడు నాలుగు మెట్లు ఎక్కడం మాత్రమే కాకుండా కచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పాత్రలు ఆయన చేసే అవకాశాలు దక్కించుకుంటాడు.

తాజాగా సోషల్‌ మీడియా ద్వారా బిగ్‌ బి మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ కాళీధర్‌ లాపాట సినిమా యొక్క ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ ట్రైలర్‌కు మంచి స్పందన దక్కింది. ట్రైలర్‌లో ఉన్న కంటెంట్‌ చూస్తూ ఉంటే ఇది ఒక మంచి ఆర్ట్‌ మూవీ అనిపిస్తుంది. అభిషేక్ బచ్చన్‌ అమాయకుడైన వ్యక్తి పాత్రలో కనిపించాడు. అతడికి చిన్న పిల్లాడు స్నేహితుడు. ఆ స్నేహితుడితో అభిషేక్‌ బచ్చన్‌ ఎలా మారుతాడు, ఇంతకు అభిషేక్‌ బచ్చన్‌ ఎవరు అనేది ఈ సినిమా కథాంశంగా కొనసాగుతుందని ట్రైలర్‌ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ఇది ఒక మంచి కంటెంట్‌ ఓరియంట్‌ మూవీగా నిలవడం ఖాయం అని అంతా నమ్ముతున్నారు. డైరెక్ట్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ కాబోతున్న ఈ సినిమా గురించి అమితాబ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాళీధర్‌ ట్రైలర్‌ను షేర్‌ చేస్తూ అమితాబ్‌ బచ్చన్‌ ఎక్స్ ద్వారా... అభిషేక్.. విభిన్నమైన పాత్రలు, సినిమాలు ఎంచుకుని వాటిలో మునిగిపోయి విజయం సాధించగల మీ సామర్థ్యం.. చాలా అరుదైన లక్షణం.. ప్రేమ, ఆశీస్సులు.. మీకు నా ప్రార్థనలు అంటూ ట్వీట్‌ చేశారు. అభిషేక్‌ బచ్చన్‌ రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూనే ఉంటారు. కానీ ఈ సినిమా ట్రైలర్‌ నచ్చి అమితాబ్ బచ్చన్‌ స్వయంగా ఆశీస్సులు అందించేందుకు గాను ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ జీ5 జులై 4న స్ట్రీమింగ్‌ చేయబోతుంది. ఈ సినిమాను థియేట్రికల్‌ రిలీజ్‌ చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల డైరెక్ట్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం చేశారు. ఈ సినిమాతో అభిషేక్‌ బచ్చన్‌ నటుడిగా మంచి పేరు దక్కించుకుంటాడని చిత్ర యూనిట్‌ సభ్యులు బలంగా చెబుతున్నారు.