స్టార్ హీరోనే వెనక్కి నెట్టేసిన డైనోసర్!
హాలీవుడ్ చిత్రాలు ఇండియాలో సత్తా చాటటం కొత్తేం కాదు. ఇండియన్ మార్కెట్ నుంచి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలున్నాయి.
By: Tupaki Desk | 8 July 2025 3:29 PM ISTహాలీవుడ్ చిత్రాలు ఇండియాలో సత్తా చాటటం కొత్తేం కాదు. ఇండియన్ మార్కెట్ నుంచి 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాలున్నాయి. ఇక ఫేమస్ ఫ్రాంచైజీ చిత్రాల గురించైతే చెప్పాల్సిన పనిలేదు. అలాంటి చిత్రాలకు ఇండియాలో ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఉంది. ఆ చిత్రాల ఎప్పుడు రిలీజ్ అవుతాయా? అని ఆసక్తిగా ఎదురు చూసేవాళ్లెంతో మంది. మహేష్..ప్రభాస్ సినిమా రిలీజ్ ల కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో? అదే తరహాలో కొన్ని హిట్ ప్రాంచైజీల కోసం ఎదురు చూసే అభిమానులెంతో మంది.
ఆ ప్రాంచైజీ నుంచి ఎన్ని సీక్వెల్స్ విడుదలైనా క్రేజ్‌ను ఎంత మాత్రం కోల్పోవు.'స్పైడర్ మ్యాన్', 'అవెంజర్స్', 'ఐరన్ మ్యాన్', 'ది మమ్మీ', జురాసిక్ పార్క్ లాంటి చిత్రాలే గొప్ప ఉదాహరణ. వీటి కథల్లో పెద్దగా మార్పు లేకపోయినా ఎగ్జైట్ మెంట్ తీసుకొచ్చి కొన్ని సన్నివేశాల కోసమైనా థియేటర్ కి వెళ్లి ఆస్వాదించే వారెంతో మంది. ఇలాంటి సినిమాలు కేవలం థియేటర్లో మాత్రమే చూడాలని చాలా మంది భావి స్తారు. పైగా ఇప్పుడు 3డీ, ఐమాక్స్ లాంటి ఫార్మెట్ లో రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంటుంది.
ఈ రెండు ఫార్మెట్ లో సినిమా అంటే ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. తాజాగా భారీ అంచ నాల మధ్య 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' ఇటీవల 3డీ ఫార్మెట్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. జురాసిక్ పార్క్ ప్రాంచైజీ అంటే ఇండియాలో ఓ బ్రాండ్. ఇప్పటివరకూ వచ్చిన అన్ని సినిమాలకు మంచి ఆదరణ లభించింది. తాజాగా రిలీజ్ అయిన రీబర్త్ ఇండియాను షేక్ చేస్తోంది. 'కన్నప్ప', 'తమ్ముడు' సినిమా కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రీబర్త్ భారత్ లో నాలుగు రోజుల్లోనే దాదాపు 45 కోట్ల వసూళ్లను సాధించిందని ట్రేడ్ నివేదికలు చెబుతున్నాయి.
ఆదివారం నుంచి కలెక్షన్లు కాస్త తగ్గినప్పటికీ మిగతా సినిమాలకంటే ఈ సినిమా మెరుగైన వసూళ్లను సాధిస్తోంది. మరో విశేషం ఏంటంటే? జురాసిక్ వరల్డ్ రీబర్త్ బ్రాడ్ పిట్ నటించిన 'ఫార్ములా వన్' చిత్రం కంటే మెరుగ్గా వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు, 'జురాసిక్ వరల్డ్ రీబర్త్ ' ప్రపంచవ్యాప్తంగా 322 మిలియన్ డాలర్లు సాధించింది. అంటే దాదాపు 2765 కోట్ల రూపాయ లు. ఎఫ్ వన్ 293 మిలియన్ డాలర్లు సాధించింది. అంటే దాదాపు 2515 కోట్ల రూపాయలు. ఆ వసూళ్లను 'జురాసిక్ వరల్డ్ రీ బర్త్' బీట్ చేసింది. ఈ చిత్రానికి భారత్ లో రివ్యూలు సానుకూలంగా రానప్పటికీ వాటితో పనిలేకుండా బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది.