ఘట్టమనేని హీరో కోసం హీరోయిన్ వేట
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
By: Tupaki Desk | 8 July 2025 5:00 PM ISTఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకు రమేష్ బాబు వారసుడు, మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ టాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నాడు. అంటే ఇప్పుడు జయకృష్ణ, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో జెనరేషన్ హీరో. ఇప్పటికే ఆ ఫ్యామిలీ నుంచి కృష్ణ ఫస్ట్ జెనరేషన్ లో రాగా ఆ తర్వాత మహేష్ బాబు వచ్చారు. ఇప్పుడు జయకృష్ణ వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్నాడు.
అయితే ఈ ఘట్టమనేని వారసుడిని లాంచ్ చేసే బాధ్యతల్ని ఆర్ఎక్స్100, మహా సముద్రం, మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా జయ కృష్ణ గత కొన్నేళ్లుగా యాక్టింగ్ తో పాటూ అన్ని కళల లోనూ ట్రైనింగ్ తీసుకున్నాడని, మొదటి సినిమాతోనే ఆడియన్స్ ను ఆకట్టుకోవాలని జయ కృష్ణ అన్ని విధాలుగా కష్టపడుతున్నాడట.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతుండగా, సెప్టెంబర్ లో షూటింగ్ ను మొదలుపెట్టాలని చూస్తున్నారట. ఈ సినిమాలో జయ కృష్ణ పక్కన ఓ కొత్త తెలుగు అమ్మాయిని హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర యూనిట్ వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను టాలీవుడ్ లోని మూడు ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు నిర్మించనున్నట్టు సమాచారం.
పద్మాలయ స్టూడియోస్, వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా జయ కృష్ణ డెబ్యూ సినిమాను నిర్మించనున్నాయి. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించే అవకాశముంది. పడి పడి లేచే మనసు, రానా నాయుడు ఫేమ్ జయకృష్ణ గుమ్మడి ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ బాధ్యతల్ని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని ఆగస్టులో స్టార్ట్ చేసి సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశముంది.