Begin typing your search above and press return to search.

మాలీవుడ్ 'జానకి వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ కేరళ'.. తెలుగు టీజర్ చూశారా?

అయితే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాను తెలుగులో కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా టీజర్ ను విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   8 July 2025 12:05 PM IST
మాలీవుడ్ జానకి వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ కేరళ.. తెలుగు టీజర్ చూశారా?
X

మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేష్‌ గోపి, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (J.S.K). కేర‌ళ‌లో జ‌రిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఆ సినిమాను ప్రవీణ్‌ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. కాస్మోస్‌ ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్ పై జె.ఫణీంద్ర కుమార్‌ నిర్మిస్తున్నారు.

ఇంటెన్స్‌ కోర్టు డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్‌ జానకి పాత్రలో కనిపించనున్నారు. బైజు సందోష్‌, మాధవ్‌ సురేష్‌ గోపి, దివ్య పిళ్లయి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ.. జూన్‌ 27న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ టైటిల్ లో సీత దేవికి మ‌రో పేరైన జాన‌కి ఉండ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ నిరాకరించడంతో రిలీజ్ వాయిదా ప‌డింది. పేరు మార్చమని చెప్పింది. ఆ విషయం చర్చనీయాంశంగా కూడా మారింది. దీంతో మేకర్స్ కోర్టును ఆశ్రయించగా.. జులై 9వ తేదీన వాదనలు విననుంది న్యాయస్థానం.

అయితే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాను తెలుగులో కూడా మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా టీజర్ ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గ్లింప్స్.. తక్కువ టైమ్ లోనే ఎక్కువ రెస్పాన్స్ సంపాదించుకుంది. సినిమాపై బజ్ కూడా క్లియేట్ చేసిందనే చెప్పాలి.

ఒక విజువల్ ను మళ్లీ మళ్లీ చేస్తే ఏదో ఒక మూమెంట్ లో కొత్త విషయాన్ని చూపిస్తుందని బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత లాయర్ గా సురేష్ గోపి ఎంట్రీ ఇచ్చారు. వాళ్లకు తెలిసిన పని వాళ్ళు చేయని.. మనం చేసిన పని మనం చేద్దాం అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి సురేష్ గోపి ఆసక్తి రేపారు.

ఆ తర్వాత అనుపమను పరిచయం చేశారు మేకర్స్. అనంతరం సినిమాలో చిన్న విజువల్స్ ను చూపించారు. చివర్లో ఒక లాయర్ తో మాట్లాడొచ్చు.. కానీ పొగరబోతుతో అంటూ వచ్చిన డైలాగ్ తో టీజర్ ఎండ్ అయింది. ప్రస్తుతం గ్లింప్స్ ఆడియన్స్ ను ఆకట్టుకుని ఇప్పుడు సందడి చేస్తోంది. టీజర్ బాగుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సురేష్ గోపి, అనుపమ యాక్టింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. ఇంట్రెస్టింగ్ మూవీలా ఉందని అంటున్నారు.