తెలుగు దర్శకుడు 'గదర్' రికార్డులు బ్రేక్
ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేయగా, 78కోట్ల దేశీయ వసూళ్లు సాధించింది.
By: Tupaki Desk | 24 April 2025 12:07 PM ISTసన్నీడియోల్ నటించిన 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' 2001లో సంచనల విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద రూ. 76.88 కోట్లు వసూలు చేసింది. ఆ సమయంలో భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. డియోల్ ఫ్యామిలీకి గొప్ప ఊపు తెచ్చిన సినిమాగాను గదర్ చరిత్రకెక్కింది. ఈ సినిమాతో డియోల్ అభిమానులు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారు.
అయితే ఇప్పుడు సన్నీడియోల్ కథానాయకుడిగా గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన 'జాత్' చిత్రం గదర్ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ గదర్ జీవితకాల బాక్సాఫీస్‌ను అధిగమించి దాదాపు రూ. 78 కోట్లు వసూలు చేసింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఓ వైపు అక్షయ్ కుమార్ లాంటి పెద్ద హీరో నటించిన 'కేసరి చాప్టర్ 2' ఇటీవలే విడుదలై పోటీ పడినా, 'జాత్' వసూళ్లు తగ్గలేదు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేయగా, 78కోట్ల దేశీయ వసూళ్లు సాధించింది. మూడోవారంలోను ఈ సినిమా భారీగా వసూలు చేసేందుకు ఆస్కారం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది. జాత్ ప్రదర్శన చూసాక ఇది ఒక తెలుగు దర్శకుడి పనితనం అన్న చర్చా సాగుతోంది. బాలీవుడ్ పాపులర్ హీరో బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఆనందంగా ఉ్నారు. ఇందులో ఒక కీలక విజయాన్ని తెలుగు దర్శకుడు గోపిచంద్ మలినేని అందించారు.
స్టార్ హీరో సన్నీ డియోల్ టాప్ 10 సినిమాల దేశీయ బాక్సాఫీస్ వసూళ్లు పరిశీలిస్తే... గదర్ 2 (2023) - రూ. 525.45 కోట్లతో డియోల్ కెరీర్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు జాత్ (2025) - రూ. 78 కోట్ల (ఇప్పటికీ థియేటర్లలో నడుస్తోంది) వసూళ్లతో రెండో స్థానంలో నిలవగా, గదర్: ఏక్ ప్రేమ్ కథ (2001) - రూ. 76.88 కోట్లతో (ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్) మూడో స్థానానికి పరిమితమైంది.
యమ్లా పగ్లా దీవానా (2011) - రూ. 55.28 కోట్లు (సెమీ-హిట్), బోర్డర్ (1997) - రూ. 39.46 కోట్లు (బ్లాక్ బస్టర్) వసూలు చేసాయి. అంతకుముందు వరుసగా పలు భారీ ఫ్లాప్ చిత్రాలతో సన్నీడియోల్ కెరీర్ తీవ్రంగా దెబ్బ తింది. యమ్లా పగ్లా దీవానా 2 (2013) - రూ. 36.7 కోట్లు (ఫ్లాప్), ఘాయల్ వన్స్ ఎగైన్ (2016) - రూ. 35.7 కోట్లు (ఫ్లాప్), సింగ్ సాబ్ ది గ్రేట్ (2013) - రూ. 26.66 కోట్లు (ఫ్లాప్), ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై (2003) - రూ. 26.23 కోట్లు (ఫ్లాప్) షోలుగా నిలిచాయి. ఇండియన్ (2001) - రూ. 24.22 కోట్లు (హిట్) వసూళ్లతో హిట్ అయింది.
'జాత్'తో మరో వారంలో విడుదలకు సిద్ధమవుతున్న ఇమ్రాన్ హష్మీ 'గ్రౌండ్ జీరో' పోటీ పడే ఛాన్సుంది. ప్రస్తుతానికి ప్రధాన పోటీ లేకపోవడంతో, మూడవ వారంలోను 'జాత్' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.