నెవ్వర్ బిఫోర్ అనేలా స్పై పాప గ్లామర్ ఎటాక్..
తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె చూపించిన స్టైలింగ్, హేర్‌స్టైల్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండటమే కాకుండా, యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
By: Tupaki Desk | 29 April 2025 8:59 PM ISTతమిళం, తెలుగు, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఐశ్వర్య మెనన్ సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. తెల్లటి టాప్, షార్ట్ ప్యాంట్‌లో స్టన్నింగ్ లుక్‌తో పోజులిచ్చిన ఈ లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ‘గ్రేస్ ఇన్ ఎవరీ గ్లాన్స్, పీస్ ఇన్ ఎవరీ బ్రీత్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ స్టిల్స్‌కి అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.
ఐశ్వర్య మెనన్ కెరీర్ విషయానికి వస్తే.. 2012లో తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తరువాత కేవలం గ్లామర్‌కు పరిమితం కాకుండా, ప్రామాణికమైన పాత్రలతోనూ మెప్పిస్తోంది. కన్నడ తెలుగులో నటించి ఆకట్టుకుంది. తెలుగులో ఆమధ్య స్పై, భజే వాయు వేగం వంటి సినిమాలలో మంచి పాత్రలు చేసింది. అయితే ఆమెకు భారీ మార్కెట్ ఉండకపోయినా, తన సొగసుతో, హావభావాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
తాజాగా షేర్ చేసిన ఫోటోల్లో ఆమె చూపించిన స్టైలింగ్, హేర్‌స్టైల్, ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండటమే కాకుండా, యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తెల్లటి కాస్ట్యూమ్‌లో ఆమె చూపించిన క్యాషువల్ యెట్ గ్లామరస్ లుక్‌కి వావ్ అంటున్నారు నెటిజన్లు. నేచురల్ లైటింగ్‌లో తీసిన ఈ ఫోటోలు ఐశ్వర్య మెనన్ అందాన్ని మరో లెవెల్‌లో చూపిస్తున్నాయనడం అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం ఆమె తమిళ, తెలుగు చిత్రాలతో పాటు ఓ వెబ్ సిరీస్ ప్రాజెక్ట్‌లోనూ బిజీగా ఉంది. కొంతకాలంగా సరైన హిట్ లేక పోయినా.. సోషల్ మీడియా పాపులారిటీతో మళ్లీ అవకాశాలు అందుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ప్రతి ఫోటోకి వేల సంఖ్యలో లైక్స్, కామెంట్లు రావడం గమనించదగ్గ విషయం. ఐశ్వర్య మెనన్ కెరీర్ పుంజుకోవడం కోసం మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక ఫ్యాషన్, ఫొటోషూట్‌లతో యూత్‌ను కట్టిపడేస్తోంది.