అంతర్జాతీయ స్థాయికి ఇండియన్ సినిమా!
ప్రాంతీయ సినిమాల అనే అడ్డంకి కూడా `బాహుబలి`తోనే తొలగిపోవడంతో దక్షిణాది మేకర్స్ ఇప్పుడ పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ గా చేసుకుంటూ సినిమాలు చేయడం మొదలు పెట్టారు.
By: Tupaki Desk | 29 April 2025 12:00 AM ISTపాన్ ఇండియా సినిమాలు `బాహుబలి`కి ముందే రూపొందినా కానీ జక్కన్న వల్లే భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతకు ముందు తమిళ, కన్నడ భాషలకు చెందిన మేకర్స్ పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కించారు కానీ అవి ఆ స్థాయిలో పాపులారిటీని దక్కించుకోలేకపోయాయి. కానీ రాజమౌళి చేసిన `బాహుబలి` తరువాతే పాన్ ఇండియా సినిమా అనే చర్చ మొదలైంది. ప్రతి ఒక్క మేకర్‌లోనూ ఆ ఆలోచన స్టార్ట్ అయింది.
ప్రాంతీయ సినిమాల అనే అడ్డంకి కూడా `బాహుబలి`తోనే తొలగిపోవడంతో దక్షిణాది మేకర్స్ ఇప్పుడ పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ గా చేసుకుంటూ సినిమాలు చేయడం మొదలు పెట్టారు. `బాహుబలి` తరువాత చాలా వరకు సినిమాలు పాన్ ఇండియా మూవీస్‌గా తెరకెక్కడం వాటికి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఆదరణ లభించడంతో పాటు రికార్డు స్థాయి వసూళ్లు దక్కుతుండడంతో ఇప్పుడు భారతీయ సినిమా ప్రపంచ వేదికల్లో విఉడదలవుతూ హాట్ టాపిక్‌గా మారుతోంది.
ఇతర దేశాల్లోనూ మన భారతీయ చిత్రాలకు గతంకంటే ఆదరణ మరీ పెరగడంతో ప్రతీ స్టార్ హీరో, మేకర్ తమ సినిమాలని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా మన సినిమాలు విడుదల కాబోతున్నాయి. RRR తరువాత గ్లోబల్‌గా మంచి పాపులారిటీని దక్కించుకున్న రాజమౌళి తను చేస్తున్న లేటెస్ట్ మూవీ SSMB29ని భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ అంతర్జాతీయ భాషల్లోనూ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇందు కోసం ఇప్పటికే ఓ హాలీవుడ్ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. ఇదే తరహాలో అల్లు అర్జున్, అట్లీల భారీపాన్ వరల్డ్ ఫిల్మ్ కూడా రిలీజ్ కాబోతోంది. సన్ పిక్చర్స్ అధినేత అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాని అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్ సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా తెరపైకి ఈసుకొస్తూ అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయడాని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుఏలో భాగంగానూ ఈ మూవీని ప్రపంచంలో అత్యంత పాపులర్ అయిన దేశాల్లో షూటింగ్ చేయబోతున్నారట.
వీటి తరహాలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ కూడా రికార్డు స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి `ఫౌజీ` పేరుతో భారీ వార్ డ్రాని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. పీరియాడిక్ వార్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని ప్రభాస్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.
ఈ భారీ చిత్రాల తరువాత వార్తల్లో నిలుస్తున్న మూవీ `పెద్ది`. బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ గ్లింప్స్‌తో అంచనాల్ని పెంచేసిన `పెద్ది`ని కూడా చరణ్ కున్న గ్లోబల్‌క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని భారీ స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటు మరో రెండు క్రేజీ పాన్ ఇండియా మూవీస్ కూడా భారీ స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న `క్రిష్ 4`. రణ్ బీర్ కపూర్, సాయి పల్లవిల `రామాయణ`. ఈ క్రేజీ సినిమాలతో భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారబోతూ ఇండియన్ సినిమా సత్తా ఏంటో మరో సారి నిరూపించబోతుండటం విశేషం.