లక్ష ఖర్చుతోనే అద్భుతమైన సెట్!
సెట్ అన్నది సినిమాకు ఓ సహజ వాతావరణాన్ని తీసుకొస్తుంది. రియల్ లోకేషన్ లో షూటింగ్ చేయలే నివన్నీ సెట్ రూపంలో క్రియేట్ చేసుకుని అందులో చిత్రీకరిస్తుంటారు.
By: Tupaki Desk | 24 Jun 2025 10:51 AM ISTసెట్ అన్నది సినిమాకు ఓ సహజ వాతావరణాన్ని తీసుకొస్తుంది. రియల్ లోకేషన్ లో షూటింగ్ చేయలే నివన్నీ సెట్ రూపంలో క్రియేట్ చేసుకుని అందులో చిత్రీకరిస్తుంటారు. ప్రతీ సినిమాకు సెట్ అన్నది చాలా కీలకం. ముఖ్యంగా పీరియాడిక్ చిత్రాలకు సెట్స్ అత్యంత కీలకం. చాలా వరకూ షూటింగ్ సెట్స్ లోనే ఉంటుంది. చరిత్ర నేపథ్యం గల కథలకు సెట్లు అంతే అవసరం. అప్పటివాతావరణాన్ని రీక్రియేట్ చేయాలంటే అది సెట్ తో మాత్రమే సాధ్యమవుతుంది. ముందుగా ఆర్ట్ వర్క్ ఆ తర్వాత దానికి త్రీడీ రూపం ఇలా వివిధ దశలలో సెట్ అన్నది నిర్మాణం జరుగుతుంది.
ఆ సెట్ నిర్మాణానికి ఖర్చు కూడా భారీగా అవుతుంది. శంకర్ అయితే ప్రత్యేకంగా పాటల కోసమే కోట్ల రూపాయలతో సెట్లు నిర్మిస్తారు. ఈ విషయంలో శంకర్ ఎక్కడా రాజీ పడరు. ఆయన అడిగినంత నిర్మాత పెట్టాల్సిందే. పాటకు సంబంధించిన భారీ తనాన్ని శంకర్ సెట్ రూపంలో చూపించడం అన్నది ఆయనకే చెల్లింది. ఇక సన్నివేశం కోసం అద్భుతమైన సెట్ నిర్మాణం రాజమౌళి నుంచి చూడొచ్చు. 'మగధీర', 'బాహుబలి', 'ఆర్ ఆర్ ఆర్' సినిమాల కోసం ఆయన వేయించిన సెట్లు కొత్త వాతావరణంలోకి తీసుకెళ్తాయి.
తాజాగా ఈ సెట్ నిర్మాణం గురించి ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్ర తంగల సెట్స్ ఎప్పుడు అవసరం పడతాయన్నది చెప్పారు. కథల స్థాయే సెట్స్ ని డిమాండ్ చేస్తున్నాయన్నారు. `ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలు చూస్తే అంతకు మించి ది బెస్ట్ ఎలా ఉంటుంది? అని ఆలోచిస్తున్నారు. ఆ పోటీని, అభిరుచిని దృష్టిలో ఉంచుకుని దర్శక, రచయితలు భారీ కథలు రాస్తున్నారు. మన సినిమాల కాన్వాస్ పెరగడం వెనుక అదే ప్రధాన కారణం. కానీ భారీ సెట్స్ తో నే విజువల్ గా మూడ్ ని సృష్టించగలం అనడం పొరపాట.
కొన్నిసార్లు చిన్న సెట్స్ తోనూ విజువల్ మరింత అద్భుతంగా చూపిస్తుంటాం. నేను ప్రొడక్షన్ డిజైన్చేసి `విరూపాక్ష` సినిమాలో రైలు గుద్దుకునే సన్నివేశం ఉంటుంది. అది సెట్టే. కేవలం లక్ష రూపాయాలతోనే ఆ వాతావరణాన్ని సృష్టించాం. తెరపై ఆ సన్నివేశాలు ఎంతో సహసిద్దంగా ఉన్నాయి` అని అన్నారు.