హైదరాబాద్ సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్
హైదరాబాద్‌లో ఎక్కడ మల్టీప్లెక్స్ ప్రారంభం అయినా కూడా అనూహ్యమైన రెస్పాన్స్ దక్కుతుంది.
By: Ramesh Palla | 12 Aug 2025 11:36 AM ISTఈ మధ్య కాలంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లతో పోల్చితే మల్టీప్లెక్స్‌లకు ఆధరణ ఎక్కువగా ఉంటుంది. మల్టీప్లెక్స్‌ల్లో సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌కి మంచి స్పందన ఉంటున్న నేపథ్యంలో కుప్పలు తెప్పలుగా మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి. హైదరాబాద్‌లో 20 ఏళ్ల క్రితం ఉన్న సింగిల్ స్క్రీన్స్‌తో పోల్చితే ప్రస్తుతం సగం కూడా లేవు. ఉన్న సగం సింగిల్ స్క్రీన్ థియేటర్లు సైతం ఎప్పుడు మూత పడేది తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మల్టీప్లెక్స్ వారు తమ బిజినెస్‌ను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ శివారు ప్రాంతం అయిన వనస్థలిపురంలో రవితేజ మల్టీప్లెక్స్ ప్రారంభం అయిన విషయం తెల్సిందే.
హైదరాబాద్‌లో వరుస మల్టీప్లెక్స్‌లు
హైదరాబాద్‌లో ఎక్కడ మల్టీప్లెక్స్ ప్రారంభం అయినా కూడా అనూహ్యమైన రెస్పాన్స్ దక్కుతుంది. సినిమాకు మంచి స్పందన వచ్చింది అంటే దాన్ని మల్టీప్లెక్స్‌లో చూడాలని ఆశ పడుతున్న వారు ఉన్నారు. నెలలో కనీసం ఒకటి రెండు సార్లు అయినా మల్టీప్లెక్స్‌కి వెళ్తున్న ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో చాలా మంది ఉన్నారు. అందుకే హైదరాబాద్‌లో మరిన్ని మల్టీప్లెక్స్‌ల నిర్మాణం జరిపేందుకు గాను ఏషియన్ వారితో పాటు, మరికొన్ని మల్టీప్లెక్స్ చైన్ థియేటర్ల యాజమాన్యం ఆసక్తిగా ఉన్నారు. ఒకప్పుడు మల్టీప్లెక్స్‌ల సంఖ్యతో పోల్చితే ఇప్పుడు హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌లు చాలా ఉన్నాయి. స్క్రీన్‌ల సంఖ్య కూడా విపరీతంగా పెంచుతున్నారు.
ఇనార్బిట్‌మాల్ లో పీవీఆర్ మల్టీప్లెక్స్
దేశంలోని అత్యధిక మల్టీప్లెక్స్ చైన్ థియేటర్లు ఉన్న పీవీఆర్ సంస్థ నుంచి మరిన్ని స్క్రీన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ఏరియా, అత్యంత ప్రైమ్ ఏరియా అయిన ఇనార్బిట్ మాల్ లో పీవీఆర్ తమ భారీ మల్టీప్లెక్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసినట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఏకంగా 11 స్క్రీన్స్ తో ఇనార్బిట్‌మాల్ లో పీవీఆర్ వారు భారీ మల్టీప్లెక్స్ ను ప్లాన్ చేశారు. ప్రస్తుతం సినిమాలు చూడాలి అంటే ప్రేక్షకులు మల్టీప్లెక్స్‌ను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో ఎన్ని స్క్రీన్స్ తో ఓపెన్ చేసినా కూడా మంచి స్పందన ఉంటుంది. అందుకే త్వరలోనే ఈ భారీ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేసేందుకు గాను సంస్థ యాజమాన్యం సిద్ధం అవుతోంది.
స్టార్ హీరోల సినిమాలకు మంచి ఓపెనింగ్స్
ప్రీమియం లార్జ్ ఫార్మట్, పీఎక్స్‌ఎల్ ను సైతం ఇక్కడ ప్రారంభించేందుకు గాను చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి పీవీఆర్ వారు మరింతగా సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ను ఇచ్చేందుకు గాను ఈ కొత్త మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు. ఇనార్బిట్‌మాల్ హైదరాబాద్‌లోనే అత్యంత ప్రైమ్ ఏరియా కావడంతో పాటు, రోజుకు వేలాది మంది అక్కడకు వెళ్తూ ఉంటారు. అంతే కాకుండా పదుల సంఖ్యలో చుట్టు పక్కల సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఇతర పెద్ద కంపెనీలు, ఆఫీస్‌లు ఉన్నాయి. కనుక ఈ మల్టీప్లెక్స్‌కి అన్ని మల్టీప్లెక్స్‌ల కంటే కూడా మంచి స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాలను ఇలాంటి మంచి మల్టీప్లెక్స్‌ల్లో చూడాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఇదో పెద్ద గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.