Begin typing your search above and press return to search.

ఆయనే మొదటి గురువు.. సడన్ షాక్ ఇచ్చిన హృతిక్!

అందులో ఏముందంటే.. "నేను మీ పక్కన నటుడిగా నా మొదటి అడుగులు వేశాను. రజినీకాంత్ సార్ మీరు నా మొదటి గురువుల్లో ఒకరు.. మీ నుండి ఎంతో ప్రేరణ పొందాను.

By:  Madhu Reddy   |   13 Aug 2025 8:00 PM IST
ఆయనే మొదటి గురువు.. సడన్ షాక్ ఇచ్చిన హృతిక్!
X

వార్ -2, కూలీ రెండు బిగ్గెస్ట్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్న వేళ హృతిక్ రోషన్, రజినీకాంత్ ని ఉద్దేశించి తన సోషల్ మీడియా ఖాతాలో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్లో రజినీకాంత్ ని తన మొదటి గురువు అంటూ హృతిక్ రోషన్ ట్వీట్ చేయడం ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ హృతిక్ రోషన్ రజినీకాంత్ గురించి పెట్టిన ఆ ఇంట్రెస్టింగ్ ట్వీట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మరికొద్ది గంటల్లో వార్-2 కూలీ రెండు ప్రీమియర్ షోస్ పడబోతున్నాయి.. రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. అయితే ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి అంటే సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఆ హీరోలు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మరికొద్ది గంటల్లో థియేటర్లో విడుదల కాబోతున్న వార్-2, కూలీ సినిమాలను పక్కనపెట్టి హృతిక్ రోషన్ తన ఎక్స్ ఖాతాలో ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టారు.

అందులో ఏముందంటే.. "నేను మీ పక్కన నటుడిగా నా మొదటి అడుగులు వేశాను. రజినీకాంత్ సార్ మీరు నా మొదటి గురువుల్లో ఒకరు.. మీ నుండి ఎంతో ప్రేరణ పొందాను. మీరు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసినందుకు అభినందనలు" అంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్ పెట్టాడు. అయితే రజినీకాంత్ హీరోగా చేసిన భగవాన్ దాదా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హృతిక్ రోషన్ నటించారు. అందుకే తన మొదటి గురువుగా రజినీకాంత్ ని చెప్పుకొచ్చారు.

వార్-2, కూలీ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా పోటీ పడబోతున్న వేళ హృతిక్ రోషన్ రజినీకాంత్ మీద పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది.అంతేకాదు హృతిక్ రోషన్ ఇతర నటినటుల పట్ల ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉంటారో ఈ ఒక్క ట్వీట్ తో అర్థం చేసుకోవచ్చు అంటూ హృతిక్ రోషన్ ఫాన్స్ ఈ ట్వీట్ ని తెగ వైరల్ చేస్తున్నారు.. వార్-2, కూలీ రెండు సినిమాల విషయానికి వస్తే..ఈ సినిమాలు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో దూసుకుపోతున్నాయి.. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న విడుదల కాబోతున్నాయి.అలాగే ఇండిపెండెన్స్ తో పాటు వీకెండ్ ని లక్ష్యంగా చేసుకొని ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి.

భారీ తారాగణంతో ఈ రెండు సినిమాలు తెరకెక్కాయి కాబట్టి కచ్చితంగా ఈ సినిమాలు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ రెండు సినిమాలు కూడా రికార్డులను తిరగ రాస్తాయని ఈ హీరోల అభిమానులు భావిస్తున్నారు. మరి చూడాలి కూలీ, వార్-2.. ఈ రెండు సినిమాల్లో బాక్సాఫీస్ కింగ్ ఎవరు అవుతారు అనేది.