భారీ స్క్రీన్స్ లో రిలీజైనా ఫలితం లేదు
హిందీ సినీ పరిశ్రమలో నవ్వుల హంగామా సృష్టించిన హౌస్ ఫుల్ ఫ్రాంచైజ్ నుంచి తాజాగా మరో కొత్త సినిమా రిలీజైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Jun 2025 10:00 PM ISTహిందీ సినీ పరిశ్రమలో నవ్వుల హంగామా సృష్టించిన హౌస్ ఫుల్ ఫ్రాంచైజ్ నుంచి తాజాగా మరో కొత్త సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి నాలుగు సినిమాలు రాగా, తాజాగా 5వ సినిమా థియేటర్లలో రన్ అవుతుంది. అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమాకు తరుణ్ మన్సుఖానీ దర్శకత్వం వహించారు.
జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ హౌస్ ఫుల్5 ఆ అంచనాలను అందుకోక పోగా కొన్ని కారణాల వల్ల ట్రోల్స్ బారిన పడింది. భారీ కాస్టింగ్ తో తెరకెక్కిన హౌస్ ఫుల్5 సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఎంత లేదన్నా ఈ సినిమా రూ.500 కోట్లు వసూలు చేసి అక్షయ్ కుమార్ కు మంచి హిట్ ను అందిస్తుందని అంతా భావించారు.
ఈ సినిమా 5000 స్క్రీన్లలో రిలీజైనప్పటికీ, టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, హౌస్ ఫుల్5 కు రెండు వారాల పాటూ ఫ్రీ గ్రౌండ్ దొరికినప్పటికీ సినిమాకు కలెక్షన్లు మాత్రం వాటికి తగ్గట్టు లేవు. దీంతో కనీసం ఈ సినిమా రూ.200 కోట్ల మార్కును అయినా దాటగలదా అని అందరూ అనుమాన పడుతున్నారు. ముందు నుంచే ఈ సినిమాలో స్టోరీ లేదని, క్రాస్ కామెడీ ఉందని అందరూ కామెంట్స్ చేశారు.
పైగా ఈ సినిమాలో మితిమీరిన స్కిన్ షో గురించి కూడా సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వినిపించాయి. ఏదేమైనా హౌస్ ఫుల్5 పై భారీ ఆశలు పెట్టుకున్న అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ కు ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. హౌస్ ఫుల్5 ఇలాంటి ఫలితాన్ని అందుకోవడంతో అక్షయ్ నుంచి తర్వాత రాబోతున్న జాలీ LLB3 అయినా మంచి రిజల్ట్ రాబడుతుందా లేదా అది కూడా హౌస్ ఫుల్5 లాగానే రూ.200 కోట్ల దగ్గర ఆగిపోతుందా అని ఫ్యాన్స్ సందేహంలో ఉన్నారు. ఏదేమైనా జాలీ LLB3పై హౌస్ ఫుల్5 ఎఫెక్ట్ తప్పకుండా పడుతుందనేది మాత్రం ఖాయం.