అక్షయ్ 'హౌస్ ఫుల్ 5' ఓపెనింగ్స్.. ఆ లిస్ట్ లో థర్డ్ ప్లేస్..
హౌస్ ఫుల్ మూవీ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ గా క్రేజ్ సంపాదించుకుంది.
By: Tupaki Desk | 7 Jun 2025 7:52 PM ISTహౌస్ ఫుల్ మూవీ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఆ సిరీస్ లో భాగంగా వచ్చిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ కాగా.. రీసెంట్ గా ఫిప్త్ పార్ట్ థియేటర్స్ లో రిలీజైంది. జూన్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలీవుడ్ నటులు రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆ సినిమాను తరుణ్ మన్ సుఖానీ తెరకెక్కించారు. సాజిద్ నడియావాలా గ్రాండ్ గా నిర్మించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్ బజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీష్రాఫ్, నానాపటేకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
అయితే ఫన్ ఎలిమెంట్స్ తో సాగిన క్రైమ్ కమ్ మర్డర్ మిస్టరీ మూవీ అని అంతా రివ్యూస్ ఇస్తున్నారు. అక్షయ్ కుమార్, అభిషేక్, ఫర్దీన్ ఖాన్ పాత్రలు సినిమాకు ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు. హౌస్ ఫుల్ 5 లో ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు ఉన్నాయన్నారు. టెక్నికల్ అంశాలు కూడా కథకు సరిపడేలా ఉన్నాయని అంటున్నారు.
అదే సమయంలో హౌస్ ఫుల్ 5 మూవీ మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. తొలి రోజు వరల్డ్ వైడ్ గా సాలిడ్ వసూళ్లను రాబట్టింది. రూ. 24.35 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. వీకెండ్ కు మరిన్ని కలెక్షన్స్ సాధించనున్నట్లు చెబుతున్నాయి. అయితే హౌస్ ఫుల్ మూవీ 2025లో మూడో హైయెస్ట్ హిందీ ఓపెనర్ గా నిలిచింది.
2025లో హైయెస్ట్ హిందీ మూవీ ఓపెనింగ్స్
1. ఛావా- రూ.33.10 కోట్లు
2. సికందర్- రూ.30.06 కోట్లు
3.హౌస్ ఫుల్ 5- రూ.24.35 కోట్లు
4. రైడ్2- రూ.19.71 కోట్లు
5. స్కై ఫోర్స్- రూ.15.30 కోట్లు
పై లిస్ట్ లో టాప్ లో ఉన్న ఛావా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. రిలీజ్ అయిన అన్ని భాషల్లో భారీ వసూళ్లు రాబట్టింది. రూ.780 కోట్లు సాధించిన ఆ మూవీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సికిందర్ కూడా అందులోనే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్కై ఫోర్స్ అందుబాటులో ఉంది. రైడ్ 2, హౌస్ ఫుల్ 5 సినిమాలు ఓటీటీ రిలీజ్ కు ఇంకా సమయం ఉంది.