Begin typing your search above and press return to search.

వీరమల్లు.. సనాతన ధర్మాన్ని రక్షించే వీరుడి కథ..!

విష్ణువు వాహనం గరుడ పక్షి సూచించేలా డేగని ఈ సినిమాలో వాడామని చెప్పారు. కథానాయకుడు తన చేతిలో శివుడి ఢమరుకం పట్టుకుని ఉంటాడు.

By:  Tupaki Desk   |   8 July 2025 6:38 PM IST
వీరమల్లు.. సనాతన ధర్మాన్ని రక్షించే వీరుడి కథ..!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా ఈ నెల 24న రిలీజ్ అవుతుంది. ఐతే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇది ఒక తెలంగాణకు చెందిన వీరుడి కథ ఆధారంగా తెరకెక్కించారని కొందరు అంటున్నారు. ఐతే ఆ వార్తలకు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగా తెరకెక్కించలేదని అన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించ డానికి వచ్చిన ఒక వీరుడి ప్రయాణాన్ని తెలిపే ఫిక్షనల్ స్టోరీగా ఇది వస్తుందని అన్నారు.

క్రిష్ తో మొదలు పెట్టిన ఈ సినిమాను మధ్యలో డైరెక్టర్ జ్యోతి కృష్ణ టేకోవర్ చేసుకున్నారు. ఐతే జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యాక వీరమల్లు కథ పూర్తిగా మారిందని అంటున్నారు. కథలోని స్పూర్తిని, సారాన్ని అలానే ఉంచి కొత్త కథగా దీన్ని తెరకెక్కించారని అన్నారు.

పురాణాల ప్రకారం చూస్తే అయ్యప్ప స్వామిని శివుడు మోహినిల కుమారుడిగా.. శైవం, వైష్ణవం మధ్య వారధిగా ఎలా చూస్తారో.. అలానే హరి హర వీరమల్లు శివుడు, విష్ణువు అవతారంగా చూడబోతున్నామని వెల్లడించారు.

విష్ణువు వాహనం గరుడ పక్షి సూచించేలా డేగని ఈ సినిమాలో వాడామని చెప్పారు. కథానాయకుడు తన చేతిలో శివుడి ఢమరుకం పట్టుకుని ఉంటాడు. ధర్మాన్ని రక్షించడానికి దాని కోసం పోరాడటానికి హరి హరుల రూపంగా ఆయన కనిపిస్తాడని అన్నారు.

వీరమల్లు సినిమాను ఏ.ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమా ట్రైలర్ రిలీజ్ ముందు వరకు ఒకలా ఉండగా ట్రైలర్ తర్వాత సినిమాపై బజ్ పెరిగింది. అంతేకాదు బిజినెస్ కూడా భారీగా చేసినట్టు తెలుస్తుంది. ఐతే ఓవర్సీస్, హిందీ రైట్స్ తప్ప హరి హర వీరమల్లు సినిమా మిగతా రైట్స్ ని ఏ.ఎం రత్నం ఎవరికీ ఇవ్వలేదు.

పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా హరి హర వీరమల్లు ట్రైలర్ చూసి సర్ ప్రైజ్ అయ్యారు. సినిమాతో పవన్ కళ్యాణ్ కి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేందుకు వాళ్లు రెడీ అవుతున్నారు. జూలై 24న రిలీజ్ అవుతున్న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందించారు.