వీరమల్లు సెకెండ్ డైరెక్టర్ ఆప్షన్ ఆయనదే!
చరిత్రలను తెరకెక్కించిన అనుభవం ఆయనకు లేదు. అయినా పవన్ జ్యోతికృష్ణ మీద ఉన్న నమ్మకంతో తెరపైకి తెచ్చారు.
By: Tupaki Desk | 8 July 2025 6:41 PM ISTపవన్ కళ్యాణ్ కథానాయకుడి `హరిహరవీరమల్లు` చిత్రం క్రిష్ దర్శకత్వంలో మొదలైన సంగతి తెలిసిందే. చాలా భాగం క్రిష్ ఆధ్వర్యంలోనే షూటింగ్ జరిగింది. అయితే అనూహ్యంగా క్రిష్ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అ య్యారు. అప్పటికే పవన్ కళ్యాణ్ వీరమల్లు షూటింగ్ కి సరిగ్గా హాజరు కావకపోవడంతో డిలే అవుతుంది. ఈ కారణంగా టీమ్ అంతా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చూసి చూసి విసిగిపోయిన క్రిష్ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. అనంతరం చిత్ర నిర్మాత ఏ. ఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఆ స్థానం లోకి వచ్చారు.
దర్శకుడిగా తనకున్న అనుభవంతో వీరమల్లు బాధ్యతలు జ్యోతికృష్ణ తీసుకున్నాడు. అయితే జ్యోతికృష్ణ ఎంట్రీ వెనుక ఉన్నది పవన్ కళ్యాణ్ అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా రత్నం రివీల్ చేసారు. క్రిష్ వెళ్లిపోయిన తర్వాత ఆ బాధ్యతలు జ్యోతికృష్ణకు అప్పగించమని పవన్ కళ్యాణ్ సూచించారుట. దీంతో ఆయన మాటకు కట్టుబడి జ్యోతికృష్ణ సీన్ లోకి వచ్చారు. ఈజానర్లో సినిమాలు చేసిన అనుభవం జ్యోతికృష్ణకు లేదు. ఇంతవరకూ ఆయన లవ్ స్టోరీలు..ఓ రెండు కమర్శి యల్ చిత్రాలు మాత్రమే చేసారు.
చరిత్రలను తెరకెక్కించిన అనుభవం ఆయనకు లేదు. అయినా పవన్ జ్యోతికృష్ణ మీద ఉన్న నమ్మకంతో తెరపైకి తెచ్చారు. మరి పవన్ నమ్మకాన్ని జ్యోతికృష్ణ ఎంత వరకూ నిలబెడతారో చూడాలి. ఇక్కడ పవన్ కు కూడా మరో ఆప్షన్ లేదు. టాలీవుడ్ లో రాజమౌళి లాంటి డైరెక్టర్ ఉన్నా? మధ్యలో ప్రాజెక్ట్ లు టేకప్ చేసే దర్శకుడు కాదు. మిగతా డైరెక్టర్ ఎవరికీ చరిత్రల్ని తీసిన అనుభవం లేదు.
ఇవన్నీ ఆలోచించుకునే జ్యోతికృష్ణ అయితే తనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని దించి నట్లు తెలుస్తోంది. జ్యోతికృష్ణ కూడా `రూల్స్ రంజన్` తర్వాత ఖాళీగానే ఉంటున్నాడు. కొత్త అవకాశాలేవి రాలేదు. అదే సమయంలో పవన్ నుంచి పిలుపు రావడంతో వీరమల్లు దర్శకుడిగా మారారు. మరి ఈసినిమా దర్శకుల జాబితాలో క్రిష్ పేరు వేస్తారా? లేదా? అన్నది చూడాలి.