పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్!
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ `హరి హర వీరమల్లు`. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు.
By: Tupaki Desk | 16 May 2025 8:38 AMపవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ `హరి హర వీరమల్లు`. దీన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. క్రిష్‌తో పాటు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీని 17వ శతాబ్దంనేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. భారీ పీరియాడిక్ ఫిల్మ్‌గా రూపొందుతున్న ఈ సినిమా మొగల్ సామ్రాజ్యం నాటి కోహినూర్ వజ్రం నేపథ్యంలో సాగనుంది. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహాలో సాగే బందిపోటు పాత్రలో కనిపించనున్నారు.
గత కొంత కాలంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడుతూ రావడం తెలిసిందే. పవన్ కల్యాణ్ క్రియాశీల రాజకీయాల్లో బిజీగా ఉండటం. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీని కారణంగా పవన్ సినిమా షూటింగ్‌లకు డేట్స్ కేటాయించలేని పరిస్థితి. అదే `హరి హర వీరమల్లు`కు ఇబ్బందికరంగా మారింది. పవన్‌కు సంబంధించిన షూటింగ్ కొంత పెండింగ్ ఉండటంతో ఈ సినిమా రిలీజ్‌పై కూడా దాని ప్రభావం పడింది. తాజాగా పవన్ డేట్స్ అడ్జస్ట్ చేయడంతో ఈ మూవీ షూటింగ్ పూర్తయింది.
దీంతో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాలని, సినిమా రిలీజ్ డేట్‌పై నెలకొన్న కన్ఫ్యూజన్‌కు తెరదించాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే శుక్రవారం పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్ ని విడుదల చేసింది. ఈ మూవీని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని జూన్ 12న విడుదల చేస్తున్నామంటూ ప్రకటించి సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీంతో ఊహించని విధంగా `హరి హర వీరమల్లు` రిలీజ్ డేట్‌ని టీమ్ ప్రకటించడంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇన్నాళ్లుగా ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక తీవ్ర ఆందోళనకు గురైన అభిమానులు చిత్ర బృందం తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించడంతో ఊపిరి పీల్చుకుంది. ఫస్ట్ పార్ట్ జూన్ 12న విడుదల కానుందని ప్రకటించినా అభిమానుల్లో కొంద మందికి ఇంకా అనుమానాలున్నాయట. ఇంత కాలం ఊరించిన హరి హర ఈ డేట్ కైనా ఖచ్చితంగా ధియేటర్లలోకి వచ్చేస్తుందా? అని ఓకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారట.