ఆ వార్తలు చూసి చాలా కోపమొచ్చింది
అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ గురించి మీడియాలో వచ్చిన వార్తలు తననెంతో బాధ పెట్టాయని రీసెంట్ గా నిర్మాత ఏఎం రత్నం అన్నారు.
By: Tupaki Desk | 8 July 2025 3:30 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాల్లో అన్నింటికంటే ముందు మొదలైన సినిమా హరి హర వీరమల్లు. ఎప్పుడో కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ గురించి మీడియాలో వచ్చిన వార్తలు తననెంతో బాధ పెట్టాయని రీసెంట్ గా నిర్మాత ఏఎం రత్నం అన్నారు. వీరమల్లు సినిమా పదేపదే వాయిదా పడుతుందోంటూ మీడియాలో వచ్చిన కథనాలు తనను బాధించాయని, వాటిని చూసి తనకు కోపం కూడా వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీరమల్లు సినిమా జులై 24న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.
వీరమల్లు సినిమా దాదాపు 14 సార్లు పోస్ట్‌పోన్ అయిందని ప్రచారం చేశారని, కానీ వాస్తవానికి సినిమా వాయిదా పడింది మూడు సార్లు మాత్రమేనని ఆయన అన్నారు. మార్చి 28, మే 9, జూన్ 12న రిలీజ్ డేట్లుగా అనౌన్స్ చేశామని, కానీ రిలీజ్ సాధ్యపడలేదని ఆయన అన్నారు. జూన్ 12న సినిమాను రిలీజ్ చేయలేకపోయినప్పుడు మాత్రం కూడా తాను కూడా చాలా బాధపడినట్టు ఆయన తెలిపారు.
ఇప్పటివరకు తన కెరీర్లో ఏ సినిమా వాయిదా పడింది లేదని, మిగిలిన నిర్మాతల్లాగా తాను సినిమాతోనే రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేయనని, మొత్తం సినిమా రెడీ అయ్యాక మాత్రమే రిలీజ్ డేట్ ను చెప్తానని, వీరమల్లు సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ కావడం వల్లే సినిమా లేటైందని, బాహుబలి లాంటి భారీ సినిమాలు కూడా ఈ వీఎఫ్ఎక్స్ కారణంగా చెప్పిన టైమ్ కు రాలేకపోయాయని, ఇప్పుడు తమ సినిమా లేట్ అవడానికి కూడా కారణమదేనని ఆయన తెలిపారు. దాంతో పాటూ సినిమా మొదలైన వెంటనే కోవిడ్ రావడం, ఆ తర్వాత ఎలక్షన్స్ రావడంతో కొంత కాలం షూటింగ్ ఆగిపోయిందని చెప్పిన ఆయన బిజినెస్ జరగకపోవడం వల్లే వీరమల్లు వాయిదా పడిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు.