Begin typing your search above and press return to search.

'ప్రేమలు' కంటే సాలీడ్ గా జింఖానా మ్యాజిక్

తాజా సమాచారం ప్రకారం, ‘ప్రేమలు’ మూవీని మించిపోయేలా ‘జింఖానా’ వసూళ్లు దూసుకుపోతున్నాయి.

By:  Tupaki Desk   |   28 April 2025 3:57 PM IST
Gymkhana Movie bigger hit than Premalu Movie
X

ఈ మధ్యకాలంలో యూత్ ను ఆకట్టుకునే సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘జాతిరత్నాలు’, ‘మ్యాడ్’ వంటి సినిమాల విజయానంతరం, మళ్ళీ అలాంటి ఫీల్ ఉన్న మూవీకి తెలుగు ప్రేక్షకులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మలయాళ హిట్ మూవీ ‘అలప్పుఝ జింఖానా’ను తెలుగులో ‘జింఖానా’ పేరుతో విడుదల చేశారు. ‘ప్రేమలు’తో గుర్తింపు తెచ్చుకున్న నెస్లాన్ కె గపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ, విడుదలైన మొదటి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది.

‘జింఖానా’ సినిమాకు యువత నుండి ఊహించని రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా మొదటి రోజు నుండి పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ తెచ్చుకున్న ఈ సినిమా, మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల దిశగా పరుగులు పెట్టుతోంది. మలయాళ డబ్బింగ్ సినిమాగా వచ్చి, స్ట్రైట్ తెలుగు సినిమాల రేంజ్ లో రెస్పాన్స్ దక్కించుకోవడం విశేషం. కథలోని నేటివిటీ టచ్, పంచ్ డైలాగ్స్, చక్కటి సంగీతం సినిమాకు అదనపు బలంగా నిలుస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం, ‘ప్రేమలు’ మూవీని మించిపోయేలా ‘జింఖానా’ వసూళ్లు దూసుకుపోతున్నాయి. థియేటర్స్ లో హౌస్‌ఫుల్ బోర్డులు మారుమోగుతున్నాయి. నైజాంలో ఇప్పటికే థియేటర్ కౌంట్ పెరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. నెస్లాన్ నటనకు, సినిమాలోని మ్యూజిక్‌కు యూత్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా క్యాచీ పంచ్ లైన్స్ యువతను బాగా ఆకర్షిస్తున్నాయి.

దర్శకుడు ఖలీద్ రెహమాన్ ‘తల్లుముల’ తర్వాత తెరకెక్కించిన ఈ సినిమా, ఫన్ ఎమోషన్ తో ప్రేక్షకులను మెప్పిస్తోంది. బాక్సింగ్ అకాడమీ నేపథ్యంలో నడిచే కథలో స్నేహం, ప్రేమ, జీవన ప్రయాణం లాంటి అంశాలు బాగా సెట్టయ్యాయి. మ్యూజిక్ కూడా సినిమాకు మంచి మైలేజ్ వచ్చింది. థియేటర్లలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కి ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

మొత్తం మీద ఈ వేసవి సీజన్‌లో ‘జింఖానా’ ఓ మినీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సరదాగా నవ్విస్తూ, లైట్ హార్ట్ ఎమోషన్ అందించిన ఈ సినిమా, ఫ్యామిలీస్‌కు, యూత్‌కు ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైన్‌మెంట్ గా నిలుస్తోంది. ఇలాంటి సినిమాలు సీజనల్ బాక్స్ ఆఫీస్‌కు మంచి ఊపును ఇస్తాయి. కంటెంట్ ఉన్న సినిమాలపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న స్పందనకు ఇది మరో ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పవచ్చు.