వీడియో: దేవుళ్లను అవమానిస్తూ లేడీ ర్యాపర్ పైత్యం
ముందుగా జెనెసిస్ యాస్మిన్ ఏ మతస్తురాలు? అన్నది అటుంచితే, తను క్లియర్ కట్ గా హిందువులు, క్రిస్టియన్లను టార్గెట్ చేయడం స్పష్టంగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 23 Jun 2025 9:23 PM ISTక్రియేటివిటీ పేరుతో వెర్రి తలలు వేయడం ఇటీవలి కాలంలో నిత్యకృత్యంగా మారింది. యూట్యూబ్, సోషల్ మీడియాల్లో నిరంతరం తమ క్రియేటివిటీని ప్రదర్శించేందుకు తహతహలాడే కొందరు దీనిని చాలా విధాలుగా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి.
ఇప్పుడు అలాంటి ఒక పైత్యాన్ని ప్రదర్శించిన మహిళా ర్యాపర్ తీవ్ర విమర్శల పాలైంది. జెనెసిస్ యాస్మిన్ మోహన్‌రాజ్ (34) అనే కెనడియన్ రాపర్ కళ పేరుతో దేవుళ్లను అపహాస్యం పాల్జేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం చర్చగా మారింది. ఒక ఒంటరి మహిళ న్యూనత, దారుణమైన ఆలోచనల్ని ప్రతిబింబించే వీడియో ఇది. ఓవైపు హిందూ మతాన్ని, మరోవైపు క్రైస్తవ మతాన్ని కూడా ఈ కెనడియన్ ర్యాపర్ కించపరిచింది.
ముందుగా జెనెసిస్ యాస్మిన్ ఏ మతస్తురాలు? అన్నది అటుంచితే, తను క్లియర్ కట్ గా హిందువులు, క్రిస్టియన్లను టార్గెట్ చేయడం స్పష్టంగా తెలుస్తోంది. హిందూ దేవత (కాళీ మాత) రంగుని ఉపయోగించుకుంది. దేవతల రూపాన్ని రీక్రియేట్ చేయదలిచింది. కానీ దానిని కూడా కాస్ట్యూమ్ లో లైంగికతతో కించపరిచింది. ఏసుక్రీస్తు శిలువను అపహాస్యం పాల్జేసేలా అభ్యంతరకర రీతిలో ఉపయోగించింది.
అయితే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇది పబ్లిసిటీ స్టంట్ అని అర్థం చేసుకోగలరు. క్రియేటివిటీ పేరుతో ఎదుటివారిని కించపరచడం ద్వారా తాను సాధించాలనుకున్నది యాస్మిన్ సాధించి ఉండొచ్చు. కానీ ఇలాంటి ప్రమాదకరమైన ర్యాపర్లు ప్రపంచానికి అవసరం లేదు. సంగీతాన్ని లైంగికతతో ముడిపెడుతూ ఈ వీడియోని సృష్టించడం ద్వారా లేడీ ర్యాపర్ లో నీచత్వం బయటపడింది. ఇది చాలా చవకబారైన ప్రదర్శన. ఇలాంటి దారుణమైన ప్రయోగాన్ని సహించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. మనోభావాలను కించపరిచే ఇలాంటి దారుణమైన వీడియోలను యూట్యూబ్ బ్యాన్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.