Begin typing your search above and press return to search.

మహేష్ వారసుడి యాక్టింగ్ స్కిల్స్.. వీడియో చూశారా?

ఇప్పుడు అతని కుమారుడు గౌతమ్ ఘట్టమనేని కూడా నటనపై ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

By:  Tupaki Desk   |   21 March 2025 1:58 PM IST
మహేష్ వారసుడి యాక్టింగ్ స్కిల్స్.. వీడియో చూశారా?
X

టాలీవుడ్‌లో స్టార్ డమ్ వంశపారంపర్యంగా కొనసాగడం కొత్త విషయం కాదు. కొందరి పిల్లలు సినిమాల పట్ల ఆసక్తి చూపకపోయినా, మరికొంత మంది మాత్రం నటనపై చిన్నప్పటినుంచే మొగ్గు చూపుతూ ఫ్యూచర్‌ను ప్లాన్ చేసుకుంటారు. ఇందులో ముఖ్యంగా స్టార్ హీరోల వారసులు వచ్చే క్రమంలో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ వారసుడిగా వచ్చి సూపర్‌స్టార్స్‌గా ఎదిగిన తరహాలో ఇప్పుడు ఇంకో స్టార్ వారసుడి ఎంట్రీపై బజ్ స్టార్ట్ అయ్యింది.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు అతని కుమారుడు గౌతమ్ ఘట్టమనేని కూడా నటనపై ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టమవుతోంది. చిన్న వయసులోనే ‘1-నేనొక్కడినే’ సినిమాలో గెస్ట్ అప్పీర్‌న్స్ ఇచ్చిన గౌతమ్, ఇప్పుడు అసలైన ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. న్యూయార్క్‌లోని ప్రసిద్ధ NYU టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో యాక్టింగ్ శిక్షణ తీసుకుంటున్న గౌతమ్.. తాజాగా ఓ మైమ్ ప్రదర్శనలో పాల్గొన్నాడు.

ఈ మైమ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్యాండిల్ లైట్ డిన్నర్ సన్నివేశాన్ని మాటలు లేకుండా భావోద్వేగాలతో అందించడం ఈ ప్రదర్శన ప్రత్యేకత. ఇందులో గౌతమ్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. నవ్వు, కోపం, బాధ వంటి ఎమోషన్లు గౌతమ్ ఎలాంటి డైలాగ్స్ లేకుండానే చాలా క్లాస్‌గా ప్రెజెంట్ చేయగలగడం ఆకట్టుకునే అంశం. ఈ ప్రదర్శనను సీరియస్‌గా తీసుకుంటే, ఆయన కెరీర్‌కు ఇది మంచి బేస్ అవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ మైమ్ వీడియోను సెరాఫీనా జెరోమీ డైరెక్ట్ చేయగా, గౌతమ్‌తో పాటు కాశ్వీ రమణి కీలక పాత్రలో కనిపించింది. గౌతమ్ నటించిన ఈ వీడియో చూసిన తర్వాత, “ఇదే ప్రారంభమై ఉండొచ్చు.. ఓ న్యాచురల్ స్టార్ వారసుడు సిద్ధమవుతున్నాడు” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. “అబ్బాయికి అందం మాత్రమే కాదు, టాలెంట్ కూడా తండ్రిని తలపిస్తుంది” అనే కామెంట్లు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. మహేష్ బాబు అభిమానులు గౌతమ్ సినిమాల్లోకి రావడంపై ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు.

ఇప్పటికైతే గౌతమ్ సినిమా అరంగేట్రానికి కొంత సమయం ఉండొచ్చు. కానీ ఇప్పుడు నుంచి అతను చేస్తున్న ప్రతి అడుగు, ప్రతి ప్రాక్టీస్ ఫ్యూచర్ కెరీర్‌కి బలం కలిగించవచ్చు. ఇండస్ట్రీలో ‘ఘట్టమనేని మూడో తరం’ అంటూ అభిమానులు హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ బాబు వంటి స్టైల్ ఐకాన్‌కి వారసుడిగా గౌతమ్ తనదైన స్టైల్‌తో మెప్పిస్తాడా అనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఏదేమైనా, ఈ మైమ్ వీడియోతో మాత్రం గౌతమ్ తన ప్రస్థానానికి పవర్ఫుల్ స్టార్ట్ ఇచ్చినట్టే.