ఫిల్మ్ అవార్డుల స్థాయిని పెంచిన తెలంగాణ ప్రభుత్వం
ఏ రంగంలో అయినా ప్రతిభ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తూ అవార్డులు ఇవ్వడమనేది ఆనవాయితీగా వస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అలానే ఆ రంగంలోని వారిని ప్రోత్సహిస్తూ అవార్డులు ఇస్తూ వచ్చారు.
By: Tupaki Desk | 29 April 2025 9:47 PM ISTఏ రంగంలో అయినా ప్రతిభ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తూ అవార్డులు ఇవ్వడమనేది ఆనవాయితీగా వస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా అలానే ఆ రంగంలోని వారిని ప్రోత్సహిస్తూ అవార్డులు ఇస్తూ వచ్చారు. 2013లో ఆఖరిగా హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక జరిగింది. ఆ కార్యక్రమంలో 2011లో రిలీజైన సినిమాలకు సంబంధించిన అవార్డులను బహుకరించారు.
అప్పుడు శ్రీరామరాజ్యం సినిమా బెస్ట్ మూవీగా సెలెక్ట్ అవగా, నిర్మాతకు రూ.75 వేల రూపాయలు, డైరెక్టర్ కు రూ.30 వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం బహుమతిగా అందించింది. ఆ తర్వాత తెలంగాణలో ఈ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరుతో తెలంగాణ ఫిల్మ్ అవార్డ్సు ను ఘనంగా నిర్వహించాలని డిసైడింది.
జూన్ 14న ఈ అవార్డులను అందించనున్నట్టు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పటికే దీని కోసం 15 మందితో ఓ స్పెషల్ జ్యూరీని కూడా ఏర్పాటు చేసి, 2024లో వచ్చిన సినిమాల్లో కొన్నింటిని సెలెక్ట్ చేసి మే చివరి నాటికి కమిటీకి పంపనుందని కూడా దిల్ రాజు తెలిపారు. జ్యూరీ పంపిన వివరాలను పరిశీలించి, అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని జూన్ 14న నిర్వహిస్తామని దిల్ రాజు తెలిపారు.
ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రం ఇచ్చిన క్యాష్ ప్రైజ్ ను తలదన్నేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవార్డు విజేతలకు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్ర నిర్మాతకు రూ. 10 లక్షలు, డైరెక్టర్ కు రూ. 7 లక్షలు బహుమతిగా ఇస్తూ ఆ అవార్డు స్థాయిని బాగా పెంచింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి ఈ అవార్డుల క్యాష్ ప్రైజ్ ను నేషనల్ ఫిల్మ్ అవార్డులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉండేలా చూస్తూ ఈ ఫంక్షన్ ను అంగరంగా వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఈ అవార్డుల వేడుక జూన్ 14న హెచ్ఐసీసీ నొవాటెల్ లో జరగనుంది.