ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ఎలా ఉంది..?
ఐతే లేటెస్ట్ సీరీస్ కు మాత్రం దాదాపు 14 ఏళ్ల దాకా టైం తీసుకున్నారు. లేటెస్ట్ గా ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అంటూ కొత్త సీరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు.
By: Tupaki Desk | 16 May 2025 5:39 PM ISTహాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉన్న సినిమాలు ఫైనల్ డెస్టినేషన్. అదేంటో తెర మీద జనాలు ఎలా చనిపోతారు అన్నది కథగా చూపిస్తూ ఫైనల్ డెస్టినేషన్ సీరీస్ లు ఆడియన్స్ లో ఒక భయాన్ని ఉతుకతను ఏర్పడేలా చేస్తాయి. దాదాపు పాతికేళ్ల క్రితం అంటే 2000 సంవత్సరం లో వచ్చిన ఫైనల్ డెస్టినేషన్ సినిమా సూపర్ హిట్ కాగా ఆ సినిమా చూసిన ఆడియన్స్ భయంతో వణికిపోయారు. ఐతే ఫైనల్ డెస్టినేషన్ ఈ పాతికేళ్లలో ఆరు సీరీస్ లు తీశారు.
ఐతే లేటెస్ట్ సీరీస్ కు మాత్రం దాదాపు 14 ఏళ్ల దాకా టైం తీసుకున్నారు. లేటెస్ట్ గా ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ అంటూ కొత్త సీరీస్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఈ కథ కూడా 1986 లోనే మొదలవుతుంది. ఆ టైం లో స్కై వ్యూ హోటల్ లో జరిగే ప్రమాదాన్ని ముందు ఊహించి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఐరిస్ (గాబ్రియల్ రోస్) ప్రయత్నిస్తుంది. ఐతే అది అంత ఈజీ కాదన్న విషయం తెలుసుకుని తన వాళ్లను పోగొట్టుకుంటుంది. ఐతే ఎంతో ప్లానింగ్ తో ఉన్నా ఐరిస్ కుటుంబాన్ని చావు ఎలా వెంబడించింది అన్నదే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ కథ.
ఈ సినిమాలో కయిట్లిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సీనియర్ ఐరిస్ గా గాబ్రియల్ అలా ఉన్న కొద్దిసేపైనా అదరగొట్టేసింది. ఇక ప్రతి పాత్రని దర్శకుడు చంపేసే సీన్స్ అయితే బాబోయ్ అనిపిస్తుంది. తెర మీద ఈ సీన్స్ అన్నీ ఎంతో న్యాచురల్ గా అనిపించడానికి సపోర్ట్ చేసిన సీజీఐ టీం ఇంకా కెమెరా వర్క్ ని మెచ్చుకోవాల్సిందే. ఐతే ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ కూడా ప్రోమోస్ లో వదలడం కాస్త ఆశ్చర్యకరంగా ఉంటుంది.
ఈ సినిమా టెక్నికల్ గా చాలా మంచి అవుట్ పుట్ ఇచ్చారు. ఐతే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఈ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్ కథ మరీ ప్రెడిక్టబుల్ గా ఉండటం స్క్రీన్ ప్లే కూడా అంత ఆసక్తికరంగా లేకపోవడం వల్ల జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఆ సీరీస్ ని ఇష్టపడే ఫ్యాన్స్ ఇంకా ఇదే టైం హార్రర్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంటుంది.