ఆవేశం స్టార్ దూకుడు తగ్గిందేంటి..?
ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో పేరు చెప్పకుండా ఒక సూపర్ హిట్ సినిమాపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు ఫహద్.
By: Ramesh Boddu | 13 Aug 2025 3:00 PM ISTసౌత్ లో ఉన్న టాలెంటెడ్ వర్సటైల్ యాక్టర్స్ లో మలయాళ నుంచి వచ్చిన ఫహద్ ఫాజిల్ ఒకరు. బలమైన పాత్ర ఎలాంటిదైనా సరే అతనికి ఇస్తే మాత్రం అదరగొట్టేస్తాడు. మలయాళంలో ఆల్రెడీ సోలో సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న ఫహద్ ఫాజిల్ మిగతా భాషల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా తమిళ్ లో ఫహద్ ఫాజిల్ విలన్ గా చేసి మెప్పిస్తున్నాడు. విక్రం, మామన్నన్ ఇలా సినిమాలు అలరించాయి. ఐతే తెలుగులో పుష్ప 1, 2 సినిమాలు చేశాడు ఫహద్. ఐతే ఆ సినిమాలో తన పాత్ర కామెడీ అవ్వడంతో సినిమా చేయకుండా ఉండాల్సిందని తర్వాత ఫీల్ అయ్యాడు.
హిట్ సినిమాపై అసంతృప్తి..
ఈమధ్యనే ఒక ఇంటర్వ్యూలో పేరు చెప్పకుండా ఒక సూపర్ హిట్ సినిమాపై తన అసంతృప్తి వ్యక్తం చేశాడు ఫహద్. అది తప్పకుండా పుష్ప గురించే అని అందరికీ తెలుసు. తెలుగులో ఫహద్ ఎంట్రీ సినిమా హిట్టే కానీ అతనికి సంతృప్తి ఇవ్వలేదు. మరో తెలుగు సినిమా ఆఫర్ వచ్చినా చేస్తాడా లేదా అన్నది కూడా తెలియదు. ఐతే ప్రస్తుతం ఫహద్ మలయాళంలోనే సోలో సినిమాలు చేస్తే బెటర్ అని భావిస్తున్నాడు.
ఆవేశం సినిమాతో సొంత భాషలో సూపర్ హిట్ కొట్టాడు ఫహద్. అదే తరహాలో సినిమాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఫహద్ ఫాజిల్ నటించిన మరో సినిమా ఒడుమ్ కుతిరా చాదుమ్ కుతిరా ఈ నెల రిలీజ్ అవుతుంది. ఆగష్టు 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా హిట్ ఐతే ఇక మలయాళంలోనే హీరోగా సినిమాలు చేయాలని అనుకుంటున్నాడట ఫహద్.
ఒడుమ్ కుతిరా చాదుమ్ కుతిరాలో ఫహద్ ఫాజిల్..
ఒడుమ్ కుతిరా చాదుమ్ కుతిరా సినిమాలో ఫహద్ ఫాజిల్ తో పాటుగా కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించింది. ఆవేశం తర్వాత ఫహద్ చేస్తున్న సినిమా కాబట్టి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆవేశం సినిమాపై తెలుగు ఆడియన్స్ చాలా ఆసక్తి చూపించారు. ఆ సినిమా తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. రీమేక్ రైట్స్ కూడా కొన్నారు. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. ఇంతకీ తెలుగులో ఆవేశం స్టార్ ఎవరన్నది కూడా ఇంకా క్లారిటీ రాలేదు.
ఫహద్ ఫాజిల్ మాత్రం ఇక మీదట ఎలాంటి మొహమాటాలకు పోకుండా తనకు నచ్చిన సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాడు. మలయాళంలో ఐతే తను సోలోగా దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఐతే ఫహద్ ఇక మీదట కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తా అని ఫిక్స్ అవ్వడం ఆయన ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఎందుకంటే తమ అభిమాన నటుడు బలమైన పాత్రల్లో చూడాలని వారు కోరుతారు. సో ఫహద్ ఇక మీద తన ఇమేజ్ కి తగిన రోల్స్ లో మాత్రమే కనిపిస్తారని చెప్పొచ్చు.