యాబ్స్‌తో కిల్ చేస్తున్న ఎల్లీ
తాజాగా ఎల్లీ పర్ఫెక్ట్ ఫిట్ యాబ్స్ ని ప్రదర్శిస్తున్న ఫోటోషూట్ ని షేర్ చేయగా అది ఇంటర్నెట్ లో మరిగిస్తోంది.
By: Tupaki Desk | 8 July 2025 10:33 PM ISTలైవ్ వైర్‌లా డ్యాన్స్ మూవ్స్ తో చెలరేగిపోయే రేర్ ట్యాలెంట్ కొందరికే ఉంటుంది. ఈ కేటగిరీకి చెందే భామలు నోరా ఫతేహి, ఎల్లీ అవ్ రామ్. ఈ ఇద్దరు భామలు బుల్లితెర, పెద్ద తెరపై స్పెషల్ డ్యాన్స్ మూవ్స్ తో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక ఎల్లీ అవ్ రామ్ క్రికెటర్లతో డేటింగ్ కారణంగా వార్తల్లోకి రాగా, నోరా ఫతేహి పేరు కాన్ మాన్ సుకేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉంది.
అయితే ఇటీవల ఎల్లీ అవ్‌రామ్ కెరీర్ పరంగా రేసులో వెనకబడింది. కొన్ని రెడ్ కార్పెట్ ఈవెంట్లు, అప్పుడప్పుడు స్టేజీ షోలలో కనిపిస్తున్న ఎల్లీ సోషల్ మీడియా రెవెన్యూ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. విదేశీ ముద్దుగుమ్మ ఎల్లీ ఇటీవల ఇన్ స్టాలో షేర్ చేసిన కొన్ని స్పెషల్ ఫోటోషూట్లు పరిశీలిస్తే, ఫ్యాషన్ సెన్స్ పరంగా ఈ భామ ఎంపికలు చాలా స్పెషల్ అని అర్థమవుతోంది.
తాజాగా ఎల్లీ పర్ఫెక్ట్ ఫిట్ యాబ్స్ ని ప్రదర్శిస్తున్న ఫోటోషూట్ ని షేర్ చేయగా అది ఇంటర్నెట్ లో మరిగిస్తోంది. టోన్డ్ ఫిజిక్, తీరైన రూపంతో మతులు చెడగొడుతోంది ఈ బ్యూటీ. బెల్లీ డ్యాన్స్, పోల్ డ్యాన్స్, ట్రెడిషనల్ డ్యాన్స్ ఇలా అన్ని విభాగాల్లో ఆరితేరిపోయిన ఎల్లీ ఫిజికల్ ఫిట్నెస్ పరంగాను ఇతరులకు స్ఫూర్తి నింపుతోంది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోషూట్ బోయ్స్ లోకి వైరల్ గా దూసుకెళుతోంది. ఎల్లీ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇటీవల అభిషేక్ బచ్చన్ `బి హ్యాపీ` చిత్రంలో అతిథి పాత్రలో మెరిసింది. ఇప్పటికే మూడు వెబ్ సిరీస్ లలో నటించిన ఎల్లీ.. ఇకపైనా వెబ్ సిరీస్ లలోను నటించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం.