Begin typing your search above and press return to search.

కుబేర పేమెంట్.. దేవిశ్రీ మాటలకు అర్థాలేంటి? ఏం జరిగింది?

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి అందరికీ తెలిసిందే. తన సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఓ రేంజ్ లో మెప్పిస్తుంటారు.

By:  Tupaki Desk   |   23 Jun 2025 11:12 AM IST
కుబేర పేమెంట్..  దేవిశ్రీ మాటలకు అర్థాలేంటి? ఏం జరిగింది?
X

టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గురించి అందరికీ తెలిసిందే. తన సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఓ రేంజ్ లో మెప్పిస్తుంటారు. 2025లో సక్సెస్ ఫుల్ గా ట్రావెల్ చేస్తున్నారు. రీసెంట్ గా నాగచైతన్య తండేల్ మూవీతో విజయం అందుకున్నారు. ఇప్పుడు కుబేర సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు దేవిశ్రీ ప్రసాద్.

సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మెప్పించారు. తన వర్క్ తో ప్రశంసలు అందుకున్నారు. అయితే సినిమా విజయంలో రాక్ స్టార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మేకర్స్ రీసెంట్ గా ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకకు దేవిశ్రీ హాజరయ్యారు. మూవీ టీమ్ ను అభినందించారు.

ఆ సమయంలో నిర్మాతలు గురించి మాట్లాడుతూ.. సినిమా రెమ్యున‌రేష‌న్ రిలీజ్‌ కు ముందే ఇచ్చేశారు.. అంత‌కంటే ఆనందం ఏముందని వ్యాఖ్యానించారు. సినిమా విడుదలకు ముందే తన బకాయిలను చెల్లించినందుకు సునీల్ నారంగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరలవుతున్నాయి.

"కెరీర్ లో నేను వర్క్ చేసిన అత్యుత్తమ ప్రొడక్షన్స్‌ లో ఆసియన్ సినిమాస్ ఒకటి. ఎందుకంటే వారు సినిమా విడుదలకు ముందే నా బకాయిలను చెల్లించారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త కథాంశం, కొత్త సంగీతంతో కూడిన మంచి సినిమా. అందరూ కుబేరా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అభినందిస్తున్నారు" అంటూ తన ప్రశంసలను గుర్తు చేసుకున్నారు.

"మూవీని బాగా నిర్మించారు. అందుకు అనుగుణంగానే వర్క్ చేశాను. నాకు సమయానికి నా పారితోషికంతో పాటు బ్లాక్‌ బస్టర్ కూడా వచ్చింది" అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. అయితే ఇప్పుడు ఆయన స్పీచ్ వైరల్ గా మారడంతో.. నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. రెమ్యునరేషన్, మ్యూజిక్, బీజీఎం విషయంలో వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారని అంటున్నారు.

దేవిశ్రీ ప్రసాద్ కు రెమ్యునరేషన్ విషయంలో ఓ ప్రొడక్షన్ హౌస్ భారీ పెండింగ్ పెట్టిందని కొద్ది రోజుల క్రితం ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అప్పుడు ఇబ్బంది పడ్డారని రూమర్లు వినిపించాయి. అవుట్ పుట్ బాగాలేదని మరో నిర్మాణ సంస్థ చెప్పిందని టాక్ వచ్చింది. దీంతో ఇప్పుడు దేవి వారందరికీ.. కుబేర సక్సెస్ మీట్ లో కౌంటర్ ఇచ్చినట్లు ఉన్నారని అంటున్నారు. పరోక్షంగా కామెంట్స్ చేసినట్లు ఉన్నారని చెబుతున్నారు.