Begin typing your search above and press return to search.

కియారా కార‌ణంగానే వాయిదా వేసారా?

కానీ కియారా గ‌ర్బం దాల్చ‌డంతో ఆమె త‌ప్పుకుంద‌ని..ఆ స్థానంలో కృతిస‌న‌న్ ని తీసుకున్న‌ట్లు వార్త లొచ్చాయి.

By:  Tupaki Desk   |   8 July 2025 6:27 PM IST
కియారా కార‌ణంగానే వాయిదా వేసారా?
X

ర‌ణ‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా ప‌ర్హాన్ అక్త‌ర్ దర్శ‌క‌త్వంలో `డాన్ 3` ప్రాజెక్ట్ ప‌నులు వేగ‌వంత‌మైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌నులు జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే సెట్స్ కు వెళ్ల‌డం ఆల‌స్య‌మైన నేప థ్యంలో? వీలైనంత త్వ‌ర‌గా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. జ‌న‌వ‌రిలో షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న న‌డుస్తోంది. తొలుత హీరోయిన్ గా కియారా అద్వాణీ ని ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే.

కానీ కియారా గ‌ర్బం దాల్చ‌డంతో ఆమె త‌ప్పుకుంద‌ని..ఆ స్థానంలో కృతిస‌న‌న్ ని తీసుకున్న‌ట్లు వార్త లొచ్చాయి. రెండు మూడు రోజులుగా అదే పాత్ర కోసం గ్లోబ‌ల్ బ్యూటీని ప్రియాంక చోప్రా తో కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ సినిమా లో హీరోయిన్ గా కియారా నే కొన‌సాగుతుంద‌ని చిత్ర వ‌ర్గాల నుంచి లీకుందుతున్నాయి. కియారా ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వ‌లేద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించిన‌ట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ ఇంత వ‌ర‌కూ షూటింగ్ మొద‌ల‌వ్వ‌క‌పోవ‌డానికి కార‌ణం కూడా కియారా అంటున్నారు. కియారా గ‌ర్బంతో ఉండ‌టంతో డిలే చేసిన‌ట్లు..ఆమె ప్ర‌స‌వం అనంత‌రం కొంత విరామం తీసుకుని షూటింగ్ కి హాజ‌ర‌వుతుంద‌ని కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి ఇందులో నిజ‌మెంతో మేక‌ర్స్ ధృవీక‌రించాల్సి ఉంది. ఈ చిత్రం షూటింగ్ జ‌న‌వ‌రిలో మొదలు పెట్ట‌డానికి మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. తాజా ప్ర‌చారం నిజ‌మైతే? కియారా ల‌క్కీ గాళ్ అవుతుంది.

`డాన్ 3`లో హీరోయిన్ గా న‌టించాల‌ని బాలీవుడ్ నుంచి గ‌ట్టి పోటీ ఉంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన రెండు భాగాలు భారి విజ‌యం సాధించిన‌వే. దీంతో ర‌ణ్ వీర్ సింగ్ కి జోడీగా సీనియ‌ర్ భామ‌ల నుంచి త‌ర్వాత త‌రం హీరోయిన్ల వ‌ర‌కూ చాలా మంది క్యూలో ఉన్నారు. వాళ్లంద‌ర్నీ కాద‌ని ప‌ర్హాన్ కియారాని ఎంపిక చేస్తే కియారా ప‌రిస్థితి మ‌రోలా ఉంది.