సూపర్ హిట్ ప్రాంచైజీ... హీరో, విలన్ ఇద్దరూ మైనస్
డాన్ ప్రాంచైజీలో కొత్త సినిమా అనగానే అంతా కచ్చితంగా షారుఖ్ ఖాన్ నటిస్తాడని అనుకుంటారు. కానీ షారుఖ్ ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తూ రణ్వీర్ సింగ్‌ను ఎంపిక చేశారు.
By: Tupaki Desk | 16 May 2025 7:00 PM ISTబాలీవుడ్ సూపర్ హిట్ ప్రాంచైజీ సినిమాల్లో 'డాన్' ముందు వరుసలో ఉంటుంది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డాన్ 1, డాన్ 2 సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. డాన్ 1 సినిమా 2006లో ప్రేక్షకుల ముందుకు రాగా, డాన్ ప్రాంచైజీలో డాన్ 2 సినిమా 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూడో పార్ట్ కోసం షారుఖ్ అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చేసినా షారుఖ్ ఖాన్ చేస్తాడని అభిమానులు అనుకుంటూ ఉండగా 15 ఏళ్ల తర్వాత డాన్ 3 సినిమా ప్రకటన వచ్చింది. డాన్ ప్రాంచైజీలో కొత్త సినిమా అనగానే అంతా కచ్చితంగా షారుఖ్ ఖాన్ నటిస్తాడని అనుకుంటారు. కానీ షారుఖ్ ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తూ రణ్వీర్ సింగ్‌ను ఎంపిక చేశారు.
డాన్ 3 సినిమాలో హీరోగా రణ్వీర్ సింగ్ నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో డాన్ 3 సినిమాను రణ్వీర్ సింగ్ హీరోగా ప్రకటించారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ముగింపు దశకు వచ్చిందని, ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సినిమాలో మొదట కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించబోతుందనే వార్తలు వచ్చాయి. ఆమెను అధికారికంగా ఎంపిక చేసినప్పటికీ పెళ్లి, ప్రెగ్నెన్సీ వల్ల డాన్ 3 సినిమా నుంచి కియారా అద్వానీ తప్పుకున్నట్లు మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది.
కియారా అద్వానీ స్థానంలో కృతి సనన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్‌కి జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా డాన్ 3 సినిమాలో విలన్‌గా 12త్ ఫెయిల్ సినిమా హీరో విక్రాంత్ మాస్సే నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. డాన్ 3 లో ఆయన ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. హీరోగా రణ్వీర్ సింగ్‌ను ప్రకటించిన సమయంలో తీవ్రమైన విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు అదే విధంగా డాన్ 3 సినిమా స్థాయి ఏంటి, ఆ సినిమాలో విక్రాంత్ మాస్సే విలన్‌గా నటించడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో నెటిజన్స్ తీవ్రమైన విమర్శలు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
డాన్ 3 సినిమాకు అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ క్రేజ్ ఉంది. ఇలాంటి సమయంలో షారుఖ్ ఖాన్‌తో తీస్తేనే బాగుంటుంది. విలన్‌గా మరోస్టార్ హీరో నటిస్తే ఇంకా బాగుంటుంది. కాని సినిమా సీక్వెల్‌లో హీరోగా రణ్వీర్ సింగ్‌ను, విలన్‌గా విక్రాంత్ మాస్సేను ఎంపిక చేయడం అనేది కచ్చితంగా తప్పుడు నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే డాన్ 3 వంటి క్రేజీ ప్రాజెక్ట్‌కి హీరోగా రణ్వీర్ సింగ్‌ను, విలన్‌గా విక్రాంత్ మాస్సేను ఎలా ఎంపిక చేశారు అంటూ విమర్శలు చేస్తున్న వారు కృతి సనన్ ను హీరోయిన్‌గా ఎలా ఎంపిక చేశారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. సినిమాకు మంచి బజ్ ఉన్న సమయంలో నటీ నటుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుండేది అనేది అందరి అభిప్రాయం.