Begin typing your search above and press return to search.

దిశా బాత్‌రూమ్‌ సెల్ఫీ వైర‌ల్

సెల్ఫీ క్వీన్ దిశా ప‌టానీ ఫ్యాష‌న్ సెన్స్ అన్నివేళ‌లా హాట్ టాపిక్. ఈ బ్యూటీ నిరంత‌రం సెల్ఫీల‌తో విరుచుకుప‌డుతుంది.

By:  Tupaki Desk   |   16 May 2025 5:03 PM IST
దిశా బాత్‌రూమ్‌ సెల్ఫీ వైర‌ల్
X

సెల్ఫీ క్వీన్ దిశా ప‌టానీ ఫ్యాష‌న్ సెన్స్ అన్నివేళ‌లా హాట్ టాపిక్. ఈ బ్యూటీ నిరంత‌రం సెల్ఫీల‌తో విరుచుకుప‌డుతుంది. తాజాగా ఆద‌మ‌రిచి సెల్ఫీ తీసుకుంటున్న దిశా ప‌టానీ ఫోటోగ్రాఫ్ ఒక‌టి ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారింది. బాత్రూమ్ లో మిర్ర‌ర్ ఎదుట సెల్ఫీ కోసం త‌పిస్తున్న దిశా పటానీ స్పెష‌ల్ క్లిక్ వైర‌ల్ గా మారుతోంది. ప్ర‌స్తుతం ఈ స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో దుమారం రేపుతోంది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... దిశా `క‌ల్కి 2898 ఏడి`లో న‌టించాక ప్ర‌భాస్- దిశా న‌డుమ‌ స్నేహం పెరిగింద‌న్న గుసగుస వినిపించింది. ఇటీవ‌ల‌ త‌న చేతిపై PD అనే ప‌చ్చ‌బొట్టుతో క‌నిపించి ర‌క‌ర‌కాల సందేహాల‌కు తెర తీసింది. పి - అంటే ప్ర‌భాస్. డి అంటే దిశా.. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో న‌డుస్తోంది అంటూ ఒక‌టే ప్ర‌చారం సాగింది అయితే పిడి అంటూ టీజ్ చేసిన దిశా పాపుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ బ్రాండ్ కి ప్ర‌చారం చేసేందుకే ఈ టెక్నిక్ ఉప‌యోగించింద‌ని ఆ త‌ర్వాత అర్థ‌మైంది.


దిశా ప‌టానీ క్రేజ్ యూత్ లో అంతంక‌త‌కు పెరుగుతోంద‌న‌డానికి ఇది ఒక ఉదాహ‌ర‌ణ‌. ఇటీవ‌ల కొంద‌రు కుర్రాళ్లు తమ గదుల్లో దిశా పోస్టర్‌ను ఉంచి, త‌మ‌ ప్రేమను ప్ర‌క‌టించిన చిలిపి ప‌ని ఆన్ లైన్ లో సంచ‌ల‌నం సృష్టించింది. ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు కొంద‌రు ఈ వింతైన ప‌నితో చ‌ర్చ‌గా మారారు. వ్యాలెంటైన్స్ డే రోజు ఈ ర‌చ్చ బయ‌ట‌ప‌డింది. దిశా అంద‌చందాల ప్ర‌ద‌ర్శ‌న‌, న‌ట‌న‌కు వీరాభిమానులం అంటూ కాలేజ్ యూత్ ప్రేమ‌ను కుర‌పించారు. ప్ర‌స్తుతం దిశా సెల్ఫీ ఫోటోగ్రాఫ్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతోంది.