Begin typing your search above and press return to search.

రీమేక్ లో స్టార్ హీరో వార‌సుడు!

చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ కి ఇంకా స‌రైన స‌క్స‌స్ ప‌డ‌లేదు. `ఆదిత్య వ‌ర్మ‌`, `మ‌హాన్` లాంటి చిత్రాలు అంచ‌నాలు అదుకోలేదు.

By:  Srikanth Kontham   |   13 Aug 2025 11:00 PM IST
రీమేక్ లో స్టార్ హీరో వార‌సుడు!
X

చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ కి ఇంకా స‌రైన స‌క్స‌స్ ప‌డ‌లేదు. `ఆదిత్య వ‌ర్మ‌`, `మ‌హాన్` లాంటి చిత్రాలు అంచ‌నాలు అదుకోలేదు. బ్యాకెండ్ లో విక్ర‌మ్ చేస్తున్నా? అత‌డి స్ట్రాట‌జీ సైతం వ‌ర్కౌట్ క‌లిసి రావ‌డం లేదు. ప్ర‌స్తుతం మారి సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న స్పోర్స్ట్ డ్రామా `బైస‌న్` లో నటి స్తున్నాడు. సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా సెట్స్ లో ఉం డ‌గానే కొత్త చిత్రాల జోరు దృవ్ నుంచి క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే మ‌ణిర‌త్నం మైండ్ లో ధృవ్ ఉన్నాడు.

యంగ్ హీరోని దృస్టిలో పెట్టుకుని ఓ క్రేజీ ల‌వ్ స్టోరీ సిద్దం చేస్తున్న‌ట్లు ప్ర‌చారంలో ఉంది. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ హిట్ చిత్రం `కిల్` రీమేక్ కూడా తెర‌పైకి వ‌చ్చింది. ధృవ్ హీరోగా కోలీవుడ్ లో ర‌మేష్ వ‌ర్మ ఈ చిత్రాన్ని రీమేక్ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇదే చిత్రాన్ని తెలుగులోనూ మ‌రో హీరోతో రీమేక్ చేసేం దుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తొలుత త‌మిళ్ లో పూర్తి చేసిన త‌ర్వాత తెలుగులో తెర‌కెక్కించా ల‌న్న‌ది ప్లాన్ గా క‌నిపిస్తుంది. ఇందులో ధృవ్ కి జోడీగా ముగ్గురు భామ‌ల‌ను ప‌రిశీలిస్తున్నారు. క‌యాదు లోహార్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, కేతిక శ‌ర్మ పేర్లు వినిపిస్తున్నాయి.

హీరోయిన్ల ఎంపిక అన్న‌ది ఒరిజిన‌ల్ వెర్ష‌న్ కు పూర్తి కాంట్రాస్ట్. మాతృక‌లో మేల్ లీడ్స్ హైలైట్ అవు తాయి. నిఖిల్ న‌గేష్ భ‌ట్ తెర‌కెక్కించిన చిత్రంలో ల‌క్ష్య‌, రాఘ‌వ్ జ్యూయెల్ మెయిన్ లీడ్స్ లో క‌నిపిస్తారు. అశిష్ విద్యార్ది, అభిషేక్ చౌహాన్ కీల‌క పాత్ర‌లు పోషించారు. తాన్యా మానిక్తాలా పీమేల్ లీడ్ పోషించింది. ఇదొక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్. కానీ కోలీవుడ్ రీమేక్ లో హీరోయిన్ల పాత్ర‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. హీరోయిన్ పాత్ర‌లకు క‌థ‌లో ప్రాధాన్య‌త క‌ల్పిస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌మేష్ వ‌ర్మ ఈ ప్రాజెక్ట్ ప‌నుల్లోనే బిజీగా ఉన్నాడు.

`ఖిలాడీ` త‌ర్వాత ర‌మేష్ వ‌ర్మ సినిమాలు చేయలేదు. ఆ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో మ‌ళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్క‌లేదు. ఈ నేప‌త్యంలో మ‌రోసారి బాలీవుడ్ రీమేక్ పై బిజీ అయ్యాడు. `ఖిలాడీ` కంటే ముందే `రాక్ష‌సుడు` చిత్రంతో మంచి హిట్ అందుకున్నాడు. ఇది ఓత‌మిళ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే.