Begin typing your search above and press return to search.

ధనుష్.. తెలుగు ట్రాక్ సో డిఫరెంట్!

ఇదిలా ఉండగా ఇప్పుడు అదే దారిలో ధనుష్ కూడా తన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 7:00 PM IST
ధనుష్.. తెలుగు ట్రాక్ సో డిఫరెంట్!
X

ఒకప్పుడు తమిళ నటులు తెలుగులో గట్టిగానే దూసుకెళ్లారు. రజినీకాంత్ తర్వాత కమల్ హాసన్, ఆపై సూర్య, కార్తీ వంటి నటులు టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద ఓ హవా చూపించారు. కానీ గత కొంత కాలంగా రజినీ తప్ప మిగిలిన తమిళ స్టార్‌ హీరోలు పెద్దగా తెలుగులో క్లిక్ అవడం లేదు. అయితే కొత్తగా శివకార్తికేయన్ మెల్లగా తన మార్కెట్‌ని పెంచుకుంటూ వస్తున్నారు. ఆమధ్య ఆమరన్ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు అదే దారిలో ధనుష్ కూడా తన క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇప్పటికే ధనుష్ నటించిన ‘సార్’ చిత్రం తెలుగులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా ద్వారా ధనుష్‌కు టాలీవుడ్‌లో స్పెషల్ గుర్తింపు వచ్చింది. ఆ క్రేజ్ తగ్గకముందే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘కుబేర’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

తెలుగులో ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో సూపర్ ఓపెనింగ్స్ సాధించగా, తమిళంలో మాత్రం మిశ్రమ స్పందన ఎదురైంది. కానీ తెలుగులో మాత్రం ధనుష్‌కు ఇది వరుసగా రెండో హిట్ కావడంతో, ఆయన మీద తెలుగు మేకర్స్‌లో ఆసక్తి పెరిగింది. ఇప్పుడు ఫ్యాన్స్‌కి ఎక్స్‌యిటింగ్ న్యూస్ ఏంటంటే.. ధనుష్ ఇప్పటికే మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

‘సార్’ సినిమాతో తనకు మంచి బ్రేక్ ఇచ్చిన వెంకీ అట్లూరి చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తయ్యాకే ఇది సెట్స్ మీదకు వెళ్లనుంది. 2027లో ఈ మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్. ఇదిలా ఉండగా, ధనుష్ తన తదుపరి చిత్రాల కోసం ఇతర తెలుగు దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

కమర్షియల్ కథలకే కాకుండా భావోద్వేగాలతో నిండిన కంటెంట్ సినిమాలపైనా ఆయన ఆసక్తి చూపుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో తన మార్కెట్‌ను బలోపేతం చేసుకోవాలన్న ఉద్దేశంతో మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తానికి ఒక తమిళ హీరోగా తెలుగులో వరుస హిట్లను అందుకోవడం, తెలుగువాళ్ల చేతే కొత్త ప్రాజెక్టులు ప్లాన్ చేయించుకోవడం అనేది ధనుష్‌కు స్పెషల్ ట్రాక్ లా మారుతోంది. ఇక రాబోయే రోజుల్లో ధనుష్ ఎలాంటి ప్రయోగాలు చేస్తారో చూడాలి.