ధనుష్‌తో డేటింగ్‌పై మృణాల్ వివరణ
దీనిపై మృణాల్ వివరణ ఇచ్చింది. ధనుష్ ని అజయ్ దేవగన్ ఆహ్వానించాడని మృణాల్ క్లారిటీనిచ్చింది. `..సర్దార్ 2` స్క్రీనింగ్‌లో ధనుష్ ఆమె చేయి పట్టుకుని కనిపించాడు.
By: Sivaji Kontham | 13 Aug 2025 12:20 AM ISTసెలబ్రిటీ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇక్కడ బంధాలు బాంధవ్యాలు ఒక వింత. నిత్యం ఏవో కొత్త కొత్త రిలేషన్ షిప్‌లు తెరపైకొస్తాయి. అంతే వేగంగా బ్రేకప్ వార్తలు వినిపిస్తాయి. అదంతా సరేకానీ.... ఇటీవల తన భార్య ఐశ్వర్య కు విడాకులిచ్చిన ధనుష్, కొద్దిరోజులుగా అందాల కథానాయిక మృణాల్ ఠాకూర్ తో ప్రేమలో ఉన్నాడని కథనాలొస్తున్నాయి.
ఆ ఇద్దరూ పలుమార్లు కలుసుకోవడమే కాదు, ఒకరితో ఒకరు పబ్లిక్ లో ఎంతో రొమాంటిగ్గా సన్నిహితంగా కలిసిపోవడంతో చాలా సందేహాలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ పుకార్లు విన్న ప్రతిసారీ మృణాల్ సింపుల్ గా నవ్వుకునేదానిని అని చెప్పింది. తాజా ఇంటర్వ్యూలో ధనుష్ తనకు స్నేహితుడు మాత్రమేనని మృణాల్ ధృవీకరించింది. తమపై వస్తున్న గాసిప్పులకు చాలా నవ్వుకున్నానని చెప్పింది. మా ఇద్దరి గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి... అది ఫన్నీగా అనిపించిందని మృణాల్ వ్యాఖ్యానించింది.
అంతేకాదు సన్ ఆఫ్ సర్ధార్ 2 స్క్రీనింగుకి ధనుష్ రావడానికి కారణం తాను ఆహ్వానించడమే కారణమని గుసగుసలు ఉన్నాయి. దీనిపై మృణాల్ వివరణ ఇచ్చింది. ధనుష్ ని అజయ్ దేవగన్ ఆహ్వానించాడని మృణాల్ క్లారిటీనిచ్చింది. `..సర్దార్ 2` స్క్రీనింగ్‌లో ధనుష్ ఆమె చేయి పట్టుకుని కనిపించాడు. ధనుష్ కొత్త సినిమా `తేరే ఇష్క్ మే` పార్టీకి మృణాల్ హాజరవ్వడం మరో ట్విస్టు. సంబంధం లేని పార్టీల్లో కొత్త అతిథి కనిపిస్తే ఎలా సందేహాలొస్తాయి. ఆ ఇద్దరినీ కలిపిన పార్టీలు అలాంటి డౌట్లు పుట్టించాయి.
ఇక ధనుష్ తనకు స్నేహితుడు! అని స్వయంగా అంగీకరించిన మృణాల్ ఇటీవల ధనుష్ సోదరీమణులను సోషల్ మీడియాల్లో ఫాలో చేస్తోంది. ఇదంతా చూస్తుంటే ఒక కాన్ సీక్వెన్స్‌లా కనిపిస్తోందని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. మొదట సాధారణ స్నేహం, తర్వాత కుటుంబీకులతో స్నేహం, ఆ తర్వాత ఇంకేదైనా జరగొచ్చు! అంటూ సోషల్ మీడియాల్లో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటికి ఫన్నీ అంటూ మృణాల్ కొట్టి పారేస్తున్నా కానీ, ఆ ఇద్దరి మధ్యా ఏం జరుగుతోందో కాస్త ఆగితే క్లారిటీ వచ్చేస్తుందని భావిస్తున్నారు.