Begin typing your search above and press return to search.

ధనుష్- వినోథ్ సినిమా.. సామ్ ఎందుకలా?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 July 2025 4:29 PM IST
ధనుష్- వినోథ్ సినిమా.. సామ్ ఎందుకలా?
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓవైపు నటుడిగా వరుస చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నారు. మరోవైపు దర్శకుడిగా వివిధ మూవీలు తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా కుబేర మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. తన యాక్టింగ్ తో వేరే లెవెల్ లో మెప్పించారు.

అయితే ధనుష్.. నెక్స్ట్ కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు హెచ్ వినోథ్ దర్శకత్వంలో నటించనున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తో జననాయగన్ మూవీ చేస్తున్న వినోథ్.. ఆ తర్వాత ధనుష్ తో వర్క్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది.

దీంతో సూపర్ కాంబో ఫిక్స్ అయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భారీ మూవీ అని చెబుతున్నారు. వెయిటింగ్ ఫర్ అఫిషియల్ అనౌన్స్మెంట్ అని అంటున్నారు. అయితే త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని వార్తలు వస్తున్నాయి. అలా అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఇంతలో మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్ ఓ పోస్ట్ కు రిప్లై పెట్టారు. ఇప్పటికే అనేక మంది సోషల్ మీడియాలో ధనుష్, వినోథ్ మూవీపై పోస్టులు పెట్టారు. అందులో ఒక పోస్ట్ కు ఫైర్ అండ్ ఎమోజీస్ తో ఆయన రిప్లై ఇచ్చారు. దీంతో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయనున్నట్లు అయింది. ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించనున్నట్లు అర్థమవుతుంది.

అయితే సామ్ సీఎస్ ఇచ్చిన అప్డేట్ తర్వాత కొందరు సినీ ప్రియులు, అభిమానులు హ్యాపీ గా ఫీలవుతున్నారు. సూపర్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం సామ్ సీఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వరకు ఆగరా అని క్వశ్చన్ చేస్తున్నారు.

అప్పుడు పుష్ప 2 టైమ్ లో కూడా అలానే చేశారని కామెంట్స్ పెడుతున్నారు. జటహార సీక్వెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తనదేనని అనేక ట్వీట్లను పెట్టారని అంటున్నారు. ఇప్పుడు ధనుష్ - వినోథ్ ప్రాజెక్ట్ విషయంలో తొందరపడ్డారని విమర్శిస్తున్నారు. వినోథ్ లేదా ధనుష్ అధికారికంగా ప్రకటించిన వరకు కొంత సంయమనం పాటించి ఉండవచ్చని అన్నారు. కానీ ఇప్పటికీ పెద్ద నష్టం ఏం లేదని చెప్పాలి. ప్రకటన వచ్చాక ఆటోమేటిక్ గా అంచనాలు క్రియేట్ అవ్వడం ఖాయం.