స్టార్ హీరో కోసం ఖాకీ దిగుతోందా?
కోలీవుడ్ స్టార్ ధనుష్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అటు తమిళ సినిమాలతో ఇటు తెలుగు సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్నాడు.
By: Tupaki Desk | 8 July 2025 7:00 PM ISTకోలీవుడ్ స్టార్ ధనుష్ పుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అటు తమిళ సినిమాలతో ఇటు తెలుగు సినిమాలతో వరుస విజయాలు అందుకుంటున్నాడు. ఇటీవలే 'కుబేర'తో పాన్ ఇండియా లో భారీ విజయం ఖాతాలో వేసుకున్నాడు. మరోసారి ధనుష్ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడని బిచ్చగాడి పాత్రతో ప్రూవ్ చేసాడు. నటుడి ఈ సినిమా ధనుష్ ని మరో మెట్టు పైకి ఎక్కించింది. అవకాశం వస్తేశేఖర్ కమ్ములాతో మరో సినిమా చేసే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ధనుష్ బాలీవుడ్ లో `తేరే ఇష్క్ మే`లో నటిస్తున్నాడు.
కోలీవుడ్ లో 'ఇడ్లీ కడై'లో నటిస్తున్నాడు. ఇది అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది. తమిళ్ లో ఈ సినిమా ఒక్కటే చేస్తున్నాడు. మరి కొత్త చిత్రాల లైనప్ సంగతేంటి? అంటే తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ఒకే చేసినట్లు తేలింది. 'ఖాకీ' ఫేం హెచ్. వినోధ్ తో ఓ సినిమాకు ఒకే చెప్పిటన్లు సమాచారం. ఇదీ వినోద్ మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ లైన్ అట. ధనుష్ కి మాస్ ఫాలోయింగ్ తెచ్చే కంటెంట్ ఉన్న స్టోరీ అంటున్నారు. ధనుష్ ఇంకా మాస్ లో అంత స్ట్రాంగ్ ఫాలోయింగ్ లేదు. క్లాసిక్ స్టోరీలతోనే ప్రేక్షకులను అలరించాడు.
అతడి కటౌట్ కి తగ్గ సినిమాలే చేసాడు. కానీ ఇప్పుడా బోర్డర్ దాటి కథలను ఎంచుకుంటున్నాడని వినోద్ ప్రాజెక్ట్ తో అర్దమవుతుంది. వినోద్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు. ఖాకీ, వలిమై లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్లతో తనకంటూ ఓ ఇమేజ్ ఉంది. అలాంటి స్టార్ తో ధనుష్ కలవడం విశేషం. ప్రస్తుతం వినోద్ దళపతి విజయ్ హీరోగా 'జన నాయగన్ ' అనే పొలిటిక్ బ్యాక్ డ్రాప్ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వినోద్ శైలికి భిన్నమైన సినిమా. విజయ్ రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తోన్న చిత్రం.
ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'జన నాయగన్' రిలీజ్ అనంతరమే ధనుష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని సమాచారం. ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం దర్శకుడిగా కన్పమ్ అయ్యారు. నిర్మాణ సంస్థ వివరాలు ఇంకా బయటకు రాలేదు. మరి ఈ చిత్రాన్ని తమిళ్ లోనే చేస్తారా? తెలుగు- తమళ్ లో రెండు భాషల్లోనూ తెరకెక్కిస్తారా? అన్నది తెలియాలి.