దసరాకి ధమాకా మోగించేది వీళ్లేనా?
దీంతో ఆ హీరోల టార్గెట్ దసరా అని బలంగా వినిపిస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్తే...పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న `రాజాసాబ్` ఏప్రిల్ రిలీజ్ అనుకున్నది జరగలేదు.
By: Tupaki Desk | 28 April 2025 3:00 PM ISTఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు చాలా వాయిదా పడ్డాయి. వాటిలో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జాప్యంతో..మరికొన్ని చిత్రీకరణ జాప్యంతో, మరికొన్ని అనివార్య కారణాలతో అనుకున్న సమయంలో రిలీజ్ కాలేకపోయాయి. వేసవికి ఒక్క స్టార్ హీరో కూడా రిలీజ్ బరిలో లేకుండా పోయారు. జూన్...జూలై అంటూ చిత్రాలను వాయిదా వేస్తున్నారు. ఈ రెండు నెలల్లో కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.
దీంతో ఆ హీరోల టార్గెట్ దసరా అని బలంగా వినిపిస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్తే...పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న `రాజాసాబ్` ఏప్రిల్ రిలీజ్ అనుకున్నది జరగలేదు. దీంతో ఈ చిత్రాన్ని దసరా కానుకగా ఆక్టోబర్ లో రిలీజ్ చేయాలనే కొత్త ఆలోచన మేకర్స్ మొదలైనట్లు ప్రచారం మొదలైంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `విశ్వంభర` రిలీజ్ విషయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే అవ్వడంతో రిలీజ్ సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో చిరు కూడా దసరా బరిలో నిలుస్తారని వినిపిస్తుంది.
అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న `ఘాటీ` ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ జాప్యం కారణంగానే వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే తమిళ్ సినిమా `ఇడ్లీ కడై` రిలీజ్ అంటూ రెడీ అయ్యారు. కానీ చివరికి ఆ చిత్రం వాయిదా పడింది. ఈ రెండు కూడా దసరా ధమాకాలుగా సిద్దమవుతున్నట్లు వినిపిస్తుంది. ఇక `కాంతార చాప్టర్ వన్ `ఇప్పటికే దసరా అంటూ ప్రచారం జరుగుతోంది.
రిషబ్ శెట్టి ఎట్టి పరిస్థితుల్లో తన చిత్రాన్ని దసరాకే రిలీజ్ చేయాలని పట్టు మీద పని చేస్తున్నారు. అలాగే నటసింహ బాలకృష్ణ తొలి పాన్ ఇండియా చిత్రం `అఖండ 2` సెప్టెంబర్ లో రిలీజ్ ఫిక్స్ చేసారు. ఒకవేళ సెప్టెంబర్ రిలీజ్ సాధ్యపడకపోతే దసరాకే ప్రేక్షకుల ముందుకొచ్చేది. ఇంకా చాలా చిత్రాలు దసరా బరిలో నిలిచే అవకాశం ఉంది.