Begin typing your search above and press return to search.

బల్క్ బుకింగ్స్.. నిర్మాతలకు మైనస్.. హీరోలకు ప్లస్!

నిజానికి ఓటీటీల రూట్ చాలా మారిందనే చెప్పాలి. ఇప్పుడు సినిమాలను కొనుగోలు చేసినప్పుడు చాలా షరతులు పెడుతున్నాయి.

By:  Tupaki Desk   |   18 April 2025 6:00 AM IST
బల్క్ బుకింగ్స్.. నిర్మాతలకు మైనస్.. హీరోలకు ప్లస్!
X

కార్పొరేట్ బల్క్ బుకింగ్స్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత కాలంగా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. పెద్ద బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకు అది చాలా కామన్ అయిపోయింది. ఒక సంప్రదాయంగా అలా ముందుకెళ్తోంది. దాని వెనుక కారణాలు ఎలా ఉన్నా.. బల్క్ బుకింగ్స్ మాత్రం అన్ని సినిమాల విషయంలో కనబడుతూనే ఉంది.

బల్క్ బుకింగ్స్ ద్వారా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తాయి. నంబర్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ అవుతాయి. దీంతో ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారని అంతా అనుకుంటారు. అదే సమయంలో కార్పొరేట్ బుకింగ్స్ వెనుక ఉన్న మరో ముఖ్య కారణం ఏంటంటే.. ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ ను ఆకట్టుకోవడమట. అందుకే మేకర్స్ అలా చేస్తున్నారట.

నిజానికి ఓటీటీల రూట్ చాలా మారిందనే చెప్పాలి. ఇప్పుడు సినిమాలను కొనుగోలు చేసినప్పుడు చాలా షరతులు పెడుతున్నాయి. విడుదలకు ముందు ఒప్పందం ఖరారు చేసుకున్నా.. థియేటర్ల సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటేనే పూర్తి స్థాయిలో చెల్లింపులు జరుపుతున్నాయి. లేకుంటే డీల్ కుదుర్చుకున్న మొత్తంలో కోత విధిస్తున్నాయని టాక్.

కాబట్టి ఓటీటీలను సాధ్యమైనంత వరకు మెప్పించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముందు సాలిడ్ డీల్ కుదిరేలా చూసేందుకు.. బల్క్ బుకింగ్స్ ను ఆశ్రయిస్తున్నారు. సాధ్యమైన చోటల్లా అలా చేస్తున్నారట. అదే సమయంలో పెద్ద సినిమాల విషయానికొస్తే.. భారం మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాల ఓటీటీ హక్కులు రూ.100 కోట్లకు అమ్ముడైతే గానే మేకర్స్ కాస్త సేఫ్ అవ్వరు. దీంతో నిర్మాతలు కార్పొరేట్ బుకింగ్‌ ల ద్వారా బాక్సాఫీస్ వద్ద నంబర్ చూపించడానికి కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పాలి. అదే సమయంలో నిర్మాతలపై ఆర్థిక భారం తడిసి మోపడమవుతుందట.

అయితే బల్క్ బుకింగ్స్ ద్వారా హీరో హీరోయిన్లు బాగా లాభపడుతున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ నంబర్స్ నమోదు అవుతుంటే వారి మార్కెట్ బాగా పెరుగుతోంది. దీంతో వారి అప్ కమింగ్ చిత్రాల విషయంలో సహాయపడుతోందనే చెప్పాలి. మొత్తానికి బల్క్ బుకింగ్స్ ద్వారా హీరో హీరోయిన్లు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. మేకర్స్ భారీ ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు!