Begin typing your search above and press return to search.

కూలీ vs వార్ 2: ప్రీమియర్స్‌లో రికార్డుల పోరు

ఇప్పుడే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది మాత్రం కూలీ vs వార్ 2 పోటీ.

By:  M Prashanth   |   12 Aug 2025 4:58 PM IST
కూలీ vs వార్ 2: ప్రీమియర్స్‌లో రికార్డుల పోరు
X

తెలుగు స్టార్స్ కారణంగా అమెరికా మార్కెట్ మరింత బలపడింది. ప్రతి పెద్ద సినిమా రిలీజ్‌కి ముందు నుంచే ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్ బాక్సాఫీస్ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు అనేక చిత్రాలు ప్రీమియర్ రికార్డులను సృష్టించగా, ఇంకా రిలీజ్ కానున్న కొన్ని సినిమాలు కూడా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా రెండు రోజుల ముందే వచ్చే ప్రీ-సేల్స్ గణాంకాలు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఇప్పుడే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది మాత్రం కూలీ vs వార్ 2 పోటీ. రెండూ భారీ స్థాయి సినిమాలు, వేర్వేరు జానర్‌లలో వచ్చినప్పటికీ, యూఎస్ఏలో టికెట్ బుకింగ్స్‌లో గట్టి పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా కూలీపై అంచనాలు ప్రత్యేకంగా ఉన్నాయి. యాక్షన్-ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమా స్టార్ హీరో మరియు డైరెక్టర్ కాంబినేషన్ వల్ల భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా కంటెంట్ ఉందని మేకర్స్ చెబుతున్నారు. మరోవైపు వార్ 2 మాత్రం బోలీవుడ్ టాలీవుడ్ కాంబినేషన్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో బజ్ సృష్టిస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టార్ క్యాస్ట్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్.

ఇక కూలీ, విడుదలకు రెండు రోజుల ముందే యూఎస్ లో ప్రీ సేల్స్ లో $533K వసూలు చేస్తే, వార్ 2 $332K వరకు చేరింది. ఈ గణాంకాలు చూస్తే, రిలీజ్ నాటికి రెండు సినిమాలు కూడా మిలియన్ మార్క్‌ను టచ్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ‘బాక్సాఫీస్ బ్యాటిల్ మొదలైంది’ అని జోష్‌లో ఉన్నారు.

విడుదలకు రెండు రోజుల ముందు.. ఈ ఏడాది టాప్ యూఎస్ఏ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ జాబితా

గేమ్ చేంజర్ $650K

కూలీ $533K*

హరిహర వీరమల్లు $406K

వార్ 2 $332K*

కింగ్‌డమ్ $316K,

హిట్ 3 $268K

యూఎస్ఏ మార్కెట్‌లో ఇలాంటి పోటీలు సాధారణమే అయినా, కూలీ vs వార్ 2 పోరులో వసూళ్ల పరంగా ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇద్దరి ఫ్యాన్స్ తమ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని నమ్ముతున్నారు. రిలీజ్‌కి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో, బుకింగ్స్ వేగం పెరుగుతుందని ట్రేడ్ టాక్. చివరి నిమిషంలో వచ్చే డిమాండ్, ప్రీమియర్ డే కలెక్షన్లు ఈ పోరుకు తుది తీర్పు ఇస్తాయి.