వార్ 2 X కూలీ.. ఓపెనింగ్స్ సంగతేంటి?
ఇప్పటికే రూ.70 కోట్లకుపైగా కూలీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టినట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 13 Aug 2025 1:44 PM ISTకూలీ, వార్-2 సినిమాల కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఆగస్టు 14వ తేదీ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నాయి. అందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారు మేకర్స్. థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టారు.
రెండు సినిమాలూ ప్రీ బుకింగ్స్ లో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఓ రేంజ్ లో టికెట్స్ ను కొనుగోలు చేస్తున్నారట సినీ ప్రియులు. ఎప్పటి నుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్న వాళ్ళు.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చూసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ప్రీ బుకింగ్స్ లో కూలీదే పైచేయి కనిపిస్తోంది.
అదే సమయంలో ఇప్పుడు రెండు చిత్రాల ఓపెనింగ్స్ కోసం అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. తొలిరోజు వసూళ్లు ఏ సినిమాకు ఎంత ఉంటాయోనని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్స్ ప్రకారం.. వార్-2 కన్నా కూలీ మూవీ ఓపెనింగ్స్ ఎక్కువగా ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే రూ.70 కోట్లకుపైగా కూలీ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ సినిమా తొలి రోజు వసూళ్లు రూ.140-150 కోట్ల మధ్య ఉంటుందని ఊహిస్తున్నారు. అదే సమయంలో రూ.100 కోట్ల వరకు వార్-2 మూవీ తొలిరోజు వసూళ్లు ఉండొచ్చని అనేక మంది ట్రేడ్ పండితులు ఇప్పుడు చెబుతున్నారు.
అయితే వార్ 2 మొదటి రోజు కూలీని అధిగమించ లేకపోయినప్పటికీ, టాక్ బాగుంటే విడుదలైన తర్వాత రోజుల్లో ఆధిక్యంలోకి వెళ్లవచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. కాగా.. వార్-2, కూలీ సినిమాలు రెండూ ఒకే జోనర్ లో రూపొందాయి. ఒకటి స్పై యాక్షన్ గా రూపొందితే, ఇంకొకటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.
వార్ 2 చిత్రాన్ని అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా, యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మించారు. కూలీ మూవీని లోకేష్ కనగరాజ్ తెరకెక్కించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ రూపొందించారు. వార్-2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. కూలీతో రజినీకాంత్, నాగార్జున సహా అనేక మంది కనిపించనున్నారు. మరి రెండు సినిమాలు ఎలాంటి వసూళ్లు సాధిస్తాయో వేచి చూడాలి.