Begin typing your search above and press return to search.

కూలీ : హైసెన్బర్గ్, అలెలా పోలెమా సీక్రెట్‌ ఏంటి?

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌, లోకేష్ కనగరాజ్‌ కాంబోలో రూపొందిన 'కూలీ' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది.

By:  Ramesh Palla   |   12 Aug 2025 12:28 PM IST
కూలీ : హైసెన్బర్గ్, అలెలా పోలెమా సీక్రెట్‌ ఏంటి?
X

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌, లోకేష్ కనగరాజ్‌ కాంబోలో రూపొందిన 'కూలీ' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. ఆగస్టు 14న విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్‌ ను రాబట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే ప్రీ సేల్‌ ద్వారా దాదాపుగా రూ.75 కోట్లకు మించి వసూళ్లు రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి. విడుదలకు మరో రెండు రోజుల సమయం ఉంది కనుక ఖచ్చితంగా రూ.100 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక ఓవరాల్‌గా ఈ సినిమా మొదటి రోజు వసూళ్లు రికార్డ్‌ బ్రేకింగ్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు, ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.

లోకేష్ కనగరాజ్ కూలీ

కూలీ సినిమాలో రజనీకాంత్‌ మాత్రమే కాకుండా నాగార్జున, అమీర్‌ ఖాన్‌, సౌబిన్ వంటి స్టార్స్ ఉండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. పైగా లోకేష్ కగనరాజ్‌ గత చిత్రాలన్నీ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే కూలీ సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ఫ్యాన్స్ ఉన్నారు. బాక్సాఫీస్‌ ను షేక్ చేసే కంటెంట్‌ ఈ సినిమాలో ఉందని లోకేష్ కనగరాజ్‌ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ బాధ్యతను సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ తన భుజాల మీద వేసుకున్నాడు. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌, శృతి హాసన్‌తో కలిసి అనిరుద్‌ రవిచంద్రన్‌ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. కూలీ వర్క్‌ ఎక్స్‌ పీరియన్స్‌ను అనిరుధ్‌ షేర్‌ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాడు.

అనిరుధ్‌ రవిచంద్రన్‌ సీక్రెట్‌

తాజాగా ఒక కార్యక్రమంలో అనిరుధ్‌ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న అలెలా పోలెమా, హైసెన్బర్గ్‌ గురించి కాస్త క్లారిటీ ఇచ్చాడు. కూలీ టీజర్ లో అలెలా పోలెమా అనే పదం వస్తుంది. ఆ పదం చాలా బాగుంది, మా స్టూడియో లో చాలా గందరగోళంగా ఉన్న సమయంలో ఆ పదం నా దృష్టికి వచ్చింది. అసలు ఏంటి ఇది అని నేను లోకేష్ కి పంపించి అడిగాను. అప్పుడు టీజర్‌లో అదే నా ఫేవరెట్‌ అన్నాడు. ఆ తర్వాత నేను గూగుల్‌ లో దాని అర్థం చూస్తే గ్రీన్‌ లో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అనే అర్థం వస్తుందని తెలిసింది. ఏదో తెలియకుండా పెట్టిన ఆ పదంకు ఇలాంటి అర్థం ఉందని తెలిసి షాక్ అయ్యాను అని అనిరుధ్‌ అన్నాడు.

కూలీ సినిమాపై అంచనాలు

ఇక హైసెన్బర్గ్‌ గురించి అనిరుధ్‌ మాట్లాడుతూ.. అతడు ఎవరు అనేది నేను, లోకేష్ చచ్చే వరకు చెప్పాం. ఆ రహస్యం మాతో పాటు సమాధి కావాల్సిందే. ఇన్నాళ్లు కొందరు హైసెన్బర్గ్‌ అంటే లోకేష్ కనగరాజ్‌ లేదా అనిరుధ్‌ అనుకున్నారు. కానీ మేము ఇద్దరం కాదు, అతడు ఒక పర్సన్‌ అని, కానీ అతడి గురించి మేము ఎప్పటికీ చెప్పము అంటూ అనిరుధ్‌ చెప్పుకొచ్చాడు. అతడితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ అద్భుతం అంటూ అనిరుధ్‌ చెప్పుకొచ్చాడు. మా కాంబోలో వచ్చిన సినిమాలు, త్వరలో రాబోతున్న కూలీ కూడా అద్భుతంగా ఉంటుందని అన్నాడు. లోకేష్ కనగరాజ్ సైతం హైసెన్బర్గ్‌ గురించి స్పందిస్తూ ఒక పర్సన్‌ అని, అతడి గురించి చెప్పలేమని అన్నాడు. అనిరుధ్‌ మాత్రం ఆ సీక్రెట్‌ మాతో సమాధి కావాల్సిందే అన్నాడు.