అనిరుధ్ లైవ్ పెర్ఫార్మెన్స్.. గూస్ బంప్సే..
2025లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీ కూడా ఒకటన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 12 Aug 2025 10:41 AM IST2025లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మూవీ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా కోసం అటు సినీ ప్రియులు.. ఇటు రజినీ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మూవీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
ఆగస్టు 14వ తేదీన సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా కూలీ మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. అదే సమయంలో సినిమా మ్యూజిక్ ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్.. సూపర్ హిట్ గా నిలిచాయి. ఓ రేంజ్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
యువ సంచలనం అనిరుధ్ రవిచందర్ టాలెంట్ ఏంటో మరోసారి చూపించారు. తన వర్క్ తో అందరినీ ఇప్పుడు మెప్పిస్తున్నారు. అదే సమయంలో మేకర్స్ రీసెంట్ గా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాస్త భిన్నంగా.. చాలా గ్రాండ్ గా ఆ వేడుకను కూలీ అన్లీష్డ్ పేరుతో నిర్వహించారు కూలీ మేకర్స్.
ఏ ఇతర యూట్యూబ్, న్యూస్ ఛానెల్స్ కు లైవ్ ఇవ్వకుండా సన్ టీవీలో ప్రసారం చేశారు. ఇప్పుడు యూట్యూబ్ లో అనిరుధ్ రవిచందర్ లైవ్ షో వీడియోను అప్లోడ్ చేశారు. పవర్ హౌస్ సాంగ్ ను అనిరుధ్.. వేడుకపై లైవ్ షో ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
మ్యూజిక్ లవర్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. అనిరుధ్ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అని అంతా కొనియాడుతున్నారు. ప్రతీ మూమెంట్ కూడా మస్ట్ వాచబుల్ అని అంటున్నారు. యువ సంచలనం అంటే ఇదేనని చెబుతున్నారు. మొత్తం పెర్ఫార్మెన్స్ అంతా గూస్ బంప్స్ తెప్పిస్తుందని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అనిరుధ్ లైవ్ పెర్ఫార్మెన్స్.. సినిమాపై ఇంకా అంచనాలు పెంచుతుందని అంటున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఆయన వర్క్.. అదిరిపోయేలా ఉండడం పక్కా అని చెబుతున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అని కామెంట్లు పెడుతున్నారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక కూలీ సాంగ్స్ ఇంకెంత హిట్స్ అవుతాయో వేచి చూడాలి.