Begin typing your search above and press return to search.

స్టార్ హీరో 63, 64 , 65 చిత్రాలు లాక్ అయ్యాయిలా!

ప్ర‌స్తుతం ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఏడాది చివ‌రిక‌ల్లా ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందని స‌మాచారం.

By:  Srikanth Kontham   |   13 Aug 2025 4:00 PM IST
స్టార్ హీరో 63, 64 , 65 చిత్రాలు లాక్ అయ్యాయిలా!
X

చియాన్ విక్ర‌మ్ మ‌ళ్లీ స్పీడ‌ప్ అవుతున్నాడా? బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు లాక్ చేస్తున్నాడా? అంటే స‌న్ని వేశం అలాగే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే 63-64వ చిత్రాలు లాక్ చేసి పెట్టాడు. 63వ చిత్రం మ‌డోన్ శివ ద‌ర్శ క‌త్వంలో...64వ చిత్రం ప్రేమ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనూ లాక్ చేసారు. ఈ రెండు చిత్రాలు అధికారికంగా ప్ర‌క‌టించారు. చిత్ర ప్రారంభోత్వం...రెగ్యుల్ షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. అయితే వీటి ప్రారంభానికి ముందే 65వ చిత్రం కూడా క‌మిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. `పార్కింగ్` చిత్రంతో జాతీయ స్థాయిలో మెరిసిన రాజ్ కుమార్ బాల‌కృష్ణన్ చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

చియాన్ రేంజ్ స‌క్సెస్ కోసం:

ప్ర‌స్తుతం ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఏడాది చివ‌రిక‌ల్లా ప్రాజెక్ట్ కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందని స‌మాచారం. ప్ర‌స్తుతం రామ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో శింబు హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతోంది. ఇది పూర్త‌యిన వెంట‌నే విక్ర‌మ్ చిత్రంపై క్లారిటీ రానుంది. విక్ర‌మ్ మాత్రం ముందుగా క‌మిట్ అయిన 63, 64 చిత్రాల‌ను ప‌ట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. విక్ర‌మ్ న‌టించిన గ‌త రెండు చిత్రాలు `తంగ‌లాన్`, `వీరదీర సూర‌న్` యావ‌రేజ్ గా ఆడాయి. ఆ రెండు విక్ర‌మ్ రేంజ్ హిట్ చిత్రాలు కాదు.

ఒకేసారి రెండు సినిమాల‌తో:

అంత‌కు ముందు న‌టించిన `పొన్నియ‌న్ సెల్వ‌న్` భారీ విజ‌యం సాధించింనా? క్రెడిట్ విక్ర‌మ్ ఒక్క‌డికే సొంత కాదు. అది మ‌ల్టీస్టార‌ర్ కోటాకి చెందిన ప్రాజెక్ట్. దీంతో విక్ర‌మ్ కి స‌రైన సోలో స‌క్స‌స్ దూర‌మైంది. ఈ నేప‌థ్యంలో రెండేళ్ల కాలంలో రెండు సినిమాల‌కే ప‌రిమిత‌య్యాడు. దీంతో వీలైనంత త్వ‌రగా కొత్త సిని మాలు పూర్తి చేసి రిలీజ్ చేసే ప్ర‌ణాళిక‌లో భాగంగా వ‌రుస చిత్రాలు ప్ర‌క‌టిస్తున్నాడు. 63-64 చిత్రాలు ఇదే ఏడాది ప్రారంభం కానున్నాయి. రెండు సినిమాల‌కు సైమ‌ల్టేనియ‌స్ గా డేట్లు కేటాయిస్తున్నాడు.

త‌న‌యుడి కోసం బ్యాకెండ్ బిజీ:

దీంతో రెండు రిలీజ్ లు వ‌చ్చే ఏడాది ఉంటాయి. అటుపై 65వ చిత్రం ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. అటు త‌న‌యుడు ధృవ్ కోసం విక్ర‌మ్ స‌మ‌యం కేటాయిస్తున్నాడు. త‌న‌యుడి న‌టించిన రెండు సినిమాలు ఆ శించిన ఫ‌లితాలు సాధించని నేప‌థ్యంలో మూడ‌వ చిత్రంతో గ్రాండ్ విక్ట‌రీ అందించేలా బ్యాకెండ్ వ‌ర్క్ చే స్తున్నాడు. అలా త‌న సినిమాలతో పాటు త‌న‌యుడు ప్రాజెక్ట్ కోసం బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు.