Begin typing your search above and press return to search.

చిరంజీవి ఛాలెంజ్ ని ఎంత మంది స్వీక‌రిస్తారు?

మెగాస్టార్ చిరంజీవి వెండి తెర‌పై కొత్త ప్ర‌యాణానికి స్వీకారం చుట్ట‌డానికి రెడీగా ఉన్నారు. వెండి తెర‌పై హీరోగానే కాదు బ‌ల‌మైన పాత్ర‌లు సైతం పోషించ‌డానికి తాను సిద్దంగా ఉన్నాను అనే సంకేతాలు పంపి చేసారు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 3:00 PM IST
చిరంజీవి ఛాలెంజ్ ని ఎంత మంది స్వీక‌రిస్తారు?
X

మెగాస్టార్ చిరంజీవి వెండి తెర‌పై కొత్త ప్ర‌యాణానికి స్వీకారం చుట్ట‌డానికి రెడీగా ఉన్నారు. వెండి తెర‌పై హీరోగానే కాదు బ‌ల‌మైన పాత్ర‌లు సైతం పోషించ‌డానికి తాను సిద్దంగా ఉన్నాను అనే సంకేతాలు పంపి చేసారు. అందుకు 'కుబేర‌'లో నాగార్జున పోషించిన దీపక్ పాత్ర‌నే స్పూర్తిగా తీసుకున్న‌ట్లు క‌నిపించింది. అలాంటి పాత్ర‌లు తానేందుకు చేయ‌కూడ‌ద‌ని ప‌బ్లిక్ గానే ఓపెన్ అయ్యారు.

దీంతో ప‌క్క‌నే ఉన్న నాగార్జున సైతం షాక్ అయ్యారు. చిరంజీవి ఇలా అన్నారేంటి? అని నాగార్జున సైతం కాసేపు సంశ‌యానికి గుర‌య్యారు. ఇది చిరంజీవిలో మ‌రోసారి డౌన్ టూ ఎర్త్ ల‌క్ష‌ణాన్ని బ‌య‌ట పెట్టింది. తానెంత మెగాస్టార్ అయినా న‌టుడిగా అలాంటి పాత్ర‌లు పోషిస్తే త‌ప్పేముంది? అన్న‌ది చిరంజీవి మ‌న‌సులో మాట‌గా హైలైట్ అయింది. ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. అయితే ఇది ద‌ర్శ‌కుల‌కు మాత్రం అతి పెద్ద స‌వాల్ అని అనాలి.

చిరంజీవి తానెంత త‌గ్గినా? ఆయ‌నా మెగాస్టార్ అన్న‌ది మాత్రం మర్చిపోలేనిది. ఆ బిరుదు ఆయ‌న ప్ర‌తిభ‌కు తార్కాణం. చిత్ర గుర్తించి ఇచ్చిన బిరుదు అది. అలాంటి పెద్ద స్టార్ ని ఓ సినిమాలో కీల‌క పాత్ర‌లో లేదా క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా చూపించ‌డం అంటే ఆషామాషీ కాదు. ప్ర‌తీ ద‌ర్శ‌కుడికి అది పెద్ద స‌వాల్. క‌త్తి మీద సాము లాంటిందే. ఎందుకంటే కోట్లాది మంది అభిమానులున్న అతి పెద్ద స్టార్ చిరంజీవి.

ఆయ‌న పాత్ర విష‌యంలో ఏమాత్రం అసంతృప్తి జ్వాల ర‌గిలినా థియేట‌ర్లు త‌గ‌ల‌బ‌డిపోతాయి. ఆయ‌న పాత్ర‌ను ఎంతో బ్యాలెన్స్ గా చూపించాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే ఇలాంటి గెస్ట్ రోల్స్...ప్ర‌ధాన పాత్ర‌ల‌ను అమితాబ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ లాంటి స్టార్లు పోషిస్తున్నారు. ర‌జ‌నీకాంత్ కూడా గ‌తంలో ఇలాంటి పాత్ర‌లు పోషించారు. చిరంజీవి మాత్రం ఆ ఛాన్స్ తీసుకుంది చాలా త‌క్కువ‌. ఇప్పుడిప్పుడే చిరు ఆ ట్రాక్ లోకి పూర్తి స్థాయిలోకి దిగుతున్నారు. మ‌రి మెగా ఇమేజ్ ని ఎన్ క్యాష్ చేసుకునే దైర్యం ఎంత మంది ద‌ర్శ‌కులు చేస్తారో చూడాలి.